twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నేను శైలజ’ గొడవ: ఉద్యోగం పోగొట్టుకున్న ఫ్యాన్‌తో రామ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ నటించిన ‘నేను శైలజ' సినిమాకు సంబంధించి ఇష్యూలో ఓ టీవీ ఛానల్ యాజమాన్యం నవీన్ అనే వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించిన సంగతి తెలిసిందే. తన సినిమా కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న నవీన్ ఇంటికి వెళ్లి స్వయంగా కలిసారు రామ్. వేరే చోట జాబ్ వచ్చే వరకు ప్రతి నెల మా ఆఫీస్‌కు వచ్చి జీతం తీసుకెళ్లమని నవీన్‌కు రామ్ చెప్పారు. రామ్ అన్నయ్య నన్ను వచ్చి కలవడం ఆనందంగా ఉందని నవీన్ తన ట్విట్టర్ ఆయనతో దిగిన సెల్పీ పోస్టు చేసాడు.

    ఇదీ వివాదం...
    ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ‘నేను శైలజ' చిత్రంపై నెగెటివ్ ప్రచారం చేయగా..... రామ్ దీనిపై తీవ్రంగా స్పందించారు. సదరు ఛానల్ తన సినిమాపై కావాలనే దుష్ప్రచారం చేసిందని వాపోయారు. ఈ క్రమంలో....అదే ఛానెల్‌లో పని చేసే ఓ ఉద్యోగి ఛానెల్ రివ్యూని తప్పు పడుతూ సినిమా పై పాజిటివ్ గా మాట్లాడటంతో ఛానల్ యాజమాన్యానికి కోపం తెప్పించింది. తమ ఛానల్ లో పని చేస్తూ ఇలా ప్రవర్తిస్తావా? అంటూ అతన్ని వెంటనే ఉద్యోగం నుండి తొలగించింది.

    Actor Ram meet Naveen

    విషయం తెలుసుకున్న రామ్ వెంటనే స్పందించి ఇది చాలా భాదాకరం, సమాజం ఎటు వెళ్తుందో కూడా తెలియడం లేదంటూ విచారం వ్యక్తం చేసారు. అంతేకాక జాబ్ పోగొట్టుకున్న వ్యక్తికు మళ్ళీ జాబ్ దొరకేవరకు ప్రతి నెల జీతం తానే ఇస్తానంటూ రామ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇపుడు స్వయంగా వెళ్లి నవీన్‌ను పరామర్శించారు.

    టీవీ ఛానల్ యాజమాన్యం నవీన్ ను ఉద్యోగం నుండి తొలగించడం... దీనికి రామ్ తనదైన రీతిలో స్పందించడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఒక రకంగా ‘నేనే శైలజ' సినిమాకు ఈ వ్యవహారం మంచి పబ్లిసిటీ తెచ్చి పెట్టిందనే చెప్పాలి.

    English summary
    Recently young and energetic actor Ram fired on noted channel for airing the program against Nenu Sailaja movie, without disclosing the name of Channel through twitter and as result of it TV5 fired on the employee Naveen Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X