‘హలో గురు ప్రేమ కోసమే’.... రామ్, దిల్ రాజు కాంబోపై భారీ అంచనాలు!
ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ త్వరలో 'హలో గురు ప్రేమ కోసమే..' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. 'నేను లోకల్' ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాగార్జున-అమల హిట్ మూవీ 'నిర్ణయం' పాటలోని లిరిక్‌ను ఈ చిత్ర టైటిల్‌గా ఎంపిక చేసుకున్నారు.

రామ్-దిల్ రాజు కాంబినేషన్
రామ్, దిల్ రాజు కాంబినేషన్ కావడం.... ఇంతకు ముందు దిల్ రాజు బేనర్లో ‘నేను లోకల్' లాంటి హిట్ చిత్రం ఇచ్చిన దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

హీరోయిన్ అనుపమ, ప్రకాష్ రాజ్ కీలకంగా
రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మార్చి 12 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దేవిశ్రీ ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు హిట్ ఆల్బమ్స్ అందించారు.

తెర వెనక
ఈ చిత్రానికి సినిమాటోగ్రపీ : విజయ్ కె.చక్రవర్తి, ఆర్ట్: సాహి సురేశ్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, మాటలు: బెజవాడ ప్రసన్నకుమార్. రచన సహకారం: సాయికృష్ణ. త్వరలో పూర్తి నటీనటులు, టెక్నీషియన్స్ లిస్ట్ విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











