»   » అపుడు అలా...ఇపుడు ఇలా: రంభ కాపురం ఏమైనట్లు?

అపుడు అలా...ఇపుడు ఇలా: రంభ కాపురం ఏమైనట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

90ల్లోనే బికినీల రేంజికి తెలుగు సినిమాను ఎగబాకించిన హాట్ హీరోయిన్లు ముగ్గురు. నగ్మ, రమ్యకృష్ణ, రంభ... అప్పట్లో ఎక్స్ ఫోజింగ్ విషయంలో పెద్దగా మొహమాటపడకుండా కష్టపడి పని చేసింది ఈ ముగ్గురే. ఇపుడు నగ్మ అసలు కనిపించకుండానే పోగా, కృష్ణ వంశీని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ మాత్రం అడపా దడపా మంచి పాత్రలే అందిపుచ్చుకుంటోంది. అయితే ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రంభ ఆ తర్వాత స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. హాట్ అండ్ సెక్సీ అందచందాలతో పాటు ఆకట్టుకునే అభినయంతో సౌత్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన రంభ...తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. తన దాంపత్య హక్కులను పునరుద్దరించాలని చెన్నై కుటుంబ న్యాయ స్థానంలో రంభ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను ఖండిస్తూ తన దాంపత్య జీవితంలో ఆనందంగానే ఉన్నాను, కావాలనే ఇలా రాస్తూ తనను బాధ పెడుతున్నారని అప్పట్లో రంభ తప్పంతా మీడియా మీద వేసి విరుచుకుపడింది కూడా. ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియా రాతలపై దుమ్మెత్తి పోసింది. అయితే ఆ ఇంటర్వ్యూ ఇచ్చి నెల కూడా గడవక ముందే మళ్లీ తన విడాకుల విషయంలో కోర్టుకు వచ్చిందట రంభ. విడాకుల కోసం కోసం గతంలో పిటీషన్ వేయగా, ఇపుడు పిల్లల పెంపకం హక్కులను కూడా తనకే ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. కేరళ వ్యాపార వేత్త ఇంద్రన్ ను రంభ 2010 ఏప్రిల్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Rambha moved a Family Court here seeking to declare and appoint her as a natural guardian of her minor children.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu