»   » హత్యాయత్నం కేసులో ‘విక్రమార్కుడు’ విలన్!

హత్యాయత్నం కేసులో ‘విక్రమార్కుడు’ విలన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actor Rehman arrested
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రంతో పాటు మరికొన్ని తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన నటుడు రెహ్మాన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసారు. ఓ వ్యక్తిని చంపడానికి ప్రయత్నించారనే కేసులో రెహమాన్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు.

నగరంలోని ఓ పార్కు సమీంలో రెహ్మాన్, మరో ఇద్దరు ఒక వ్యక్తిపై ఆయుధాలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని, తీవ్రగాయాల పాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ రోజే రెహమాన్‌ను కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరో వైపు ఇదే రోజు...మరో టాలీవుడ్ నటుడు ఉదయ్ కూడా అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులో ఉదయ్‌తో పాటు ఓ నైజీరియర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వారి వద్ద నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఉదయ్‌ని కూడా ఇదే రోజు కోర్టు ముందు ప్రవేశ పెట్టనున్నారు.

ఉదయ్ గతంలో పరారె, ఫ్రెండ్స్ క్లబ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఉదయ్ ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. విచారణ అనంతరం ఉదయ్‌ని పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం.

English summary
The Hyderabad police on Monday arrested, actor Rehman in connection with a murder attempt case. Rehman played the role of villain in the film, Vikramarkudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu