»   » నిహారికతో పెళ్లి: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ క్లారిటీ.. ఏమన్నాడంటే..

నిహారికతో పెళ్లి: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ క్లారిటీ.. ఏమన్నాడంటే..

Written By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకొని ఓ రూమర్ సోషల్ మీడియాలో గత రెండురోజులుగా హల్‌చల్ రేపుతున్నది. నాగబాబు మేనల్లుడు సాయిధరమ్ తేజ్, కూతురు నిహారికకు త్వరలో వివాహం జరుగనున్నదనే వార్త వైరల్‌గా మారింది. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు జోరందుకున్నాయి.

Actor Sai Dharam Tej given clarity on Niharika marriage with him

సాయిధరమ్ తేజ్, నిహారిక వరుసకు బావమరదళ్లు కావడంతో ఆ వార్తలో తప్పేమీ లేదని అందరూ భావించారు. సాయిధరమ్ తేజ్ హీరోగా కూడా మెప్పిస్తుండటంతో మెగా ఫ్యామిలీకి తగిన అల్లుడేనని అంతా అనుకొన్నారు. అయితే ఆ వార్తలో నిజం లేదని సాయిధరమ్ తేజ్ వివరణ ఇవ్వడంతో అదీ రూమర్ అని తేలింది.

మెగా ఫ్యామిలీలో గందరగోళం

మెగా ఫ్యామిలీలో గందరగోళం

గత రెండురోజులుగా సాయిధరమ్ తేజ్, నిహారిక పెళ్లి విషయం మీడియాలో హడావిడి చేస్తున్నా మెగా ఫ్యామిలీ స్పందించకపోవడంతో కొంత గందరగోళం నెలకొన్నది. ఈ గాసిప్ వార్త విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో సాయిధరమ్ తేజ్ సోమవారం స్పందించాడు. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయించాడు. దాంతో ఈ గందరగోళానికి తెరపడింది.

వార్త అవాస్తవం

వార్త అవాస్తవం

సాయిధరమ్ తేజ్ ప్రకటన సారాంశం ఏమిటంటే ‘నిహారిక నేను పెళ్లి చేసుకోనున్నట్టు మీడియాలో వ‌స్తున్న‌ వార్త‌ల‌న్నీఅవాస్త‌వం.. కొన్ని మాధ్యమాల్లో ఈ విష‌యంపై వార్త‌లు రావ‌డం బాధాక‌రం. మేమిద్ద‌రం చిన్నతనం నుంచి ఒకే కుటుంబంలో క‌లిసి పెరిగాం.. ఆమె నాకు సిస్టర్ లాంటింది. మా కుటుంబస‌భ్యులు కూడా మమ్మల్నీ అన్నాచెల్లెళ్లుగానే భావిస్తారు అని సాయిధరమ్ పేర్కొన్నాడు.

ఇలాంటి వార్తలు రావడం బాధాకరం

ఇలాంటి వార్తలు రావడం బాధాకరం

నిహారిక పెళ్లికి సంబంధించి ఇలాంటి వార్త‌లు రావ‌డం బాధాక‌రం. ఆధారాలు లేని వార్త‌లు మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తాయి.. ఇలాంటి విషయాలు రాసేముందు ఒక‌టికి రెండుసార్లు ధృవీక‌రించుకోంటే బాగుంటుంది. ఈ విషయం ఓ ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం అని లేఖ‌లో వెల్లడించాడు.

ఒక మనసుతో..

ఒక మనసుతో..

మెగా బ్రదర్ నాగబాబు కూతురైన నిహారిక ఇటీవల టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఒక మనసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో నాగశౌర్యకు జతగా ఆమె నటించారు. నిహారిక నటనపై విమర్శకుల నుంచి సానుకూల స్పందన రావడం తెలిసిందే.

సొంత ఇమేజ్‌తో సాయి

సొంత ఇమేజ్‌తో సాయి

సాయిధరమ్ తేజ్ వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకుంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నాడు. విన్నర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంత నిరాశపరిచినా మంచి కలెక్షన్లనే సాధించాయి. సాయిధరమ్ నటించిన నక్షత్రం, జవాను చిత్రం విడుదల కావాల్సి ఉంది.

గతంలో కూడా రూమర్లు..

గతంలో కూడా రూమర్లు..

తెలుగు తెరకు నిహారిక హీరోయిన్‌గా పరిచయం అయ్యే ముందు సాయిధరమ్ తేజ్‌తోనే తొలి సినిమా చేస్తుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఆ తర్వాత అవ‌న్నీ గాసిప్స్ అని తేలిపోయింది. కానీ తాజా రూమ‌ర్స్ తో మెగా అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
Actor Sai Dharam Tej given clarity on His marriage with Niharika. Rumors spread in filmnagar that Mega hero Sai Dharam Tej And Niharika Is Getting Married soon. But Sai condemn the news and said that Niharika is like sister to me.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu