మెగాస్టార్‌ను అన్నయ్య అని ఛాన్స్ అడిగితే.. రొటీన్ అయిపోయావురా అన్నారు: సాయి కుమార్ కామెంట్స్

టాలెంట్ ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు ఉన్నా కూడా కొంతమంది మాత్రమే ఎప్పటికైనా అలానే గుర్తిండిపోతారు. ఈ కాలంలో స్టార్ హోదాను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ఇక కొంతమంది హీరోగా చేసి ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నారు. అలాంటి టాలెంటెడ్ నటులలో సాయి కుమార్ ఒకరు. ఆయన వాయిస్ ఓవర్ డైలాగ్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన పాజిటివ్ కామెంట్స్ గురించి సాయి కుమార్ వివరణ ఇచ్చారు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఎన్నో సినిమాలు

డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఎన్నో సినిమాలు

ఒకప్పుడు ఆవేశపూరితమైన క్యారెక్టర్లతో సాయి కుమార్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్స్ అందుకున్నారు. అలాగే రాజశేఖర్, సుమన్ వంటి హీరోలకు ఇప్పటికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా క్లిక్కయ్యారు. ఇక కొన్నేళ్ల అనంతరం హీరోగా ప్లాప్స్ రావడంతో అవకశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

దారుణంగా దెబ్బ కొట్టిన సినిమా

దారుణంగా దెబ్బ కొట్టిన సినిమా

ఇక సాయి కుమార్ కెరీర్ లో ఒక సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈశ్వర్ అల్లా అనే సినిమా చిత్రీకరణ సమయంలో నిర్మాత మధ్యలోనే చేతులు ఎత్తేయడంతో సాయి కుమార్ సొంత డబ్బుతో ఆ సినిమాను ఫినిష్ చేశాడు. కానీ ఆ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా సాయి కుమార్ సపోర్టింగ్ రోల్స్ తో మళ్ళీ ఫామ్ లోమీ వచ్చి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.

మెగాస్టార్ చెప్పిన మాటలు

మెగాస్టార్ చెప్పిన మాటలు

అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ గురించి సాయి కుమార్ వివరణ ఇచ్చారు. SR కళ్యాణమండపం అనే సినిమాలో విభిన్నమైన పాత్రలో నటిస్తున్న సాయి కుమార్ ఆ సినిమా ప్రమోషన్ లో తన నట జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల తన 60వ పట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ప్రత్యేకంగా కలిసి ఒక మాట చెప్పడమే కాకుండా మంచి బూస్ట్ ఇచ్చినట్లు చెప్పారు.

ఏదైనా కొత్తగా చేస్తే బావుంటుంది

ఏదైనా కొత్తగా చేస్తే బావుంటుంది

మెగాస్టార్ చిరంజీవిని తాను అన్నయ్య అని అంటానని మాట్లాడుతూ.. అన్నయ్య మళ్ళీ నీ సినిమాలో ఏదైనా మంచి పాత్రలో నటించాలని ఉందని డైరెక్ట్ గా అడిగేసినట్లు చెప్పారు. ఇక అందుకు మెగాస్టార్.. రొటీన్ అయిపోయావు రా.. అవే వేషాలు వేస్తున్నావు. ఏదైనా కొత్తగా చేస్తే బావుంటుంది. కొత్తగా ఆలోచించారా.. ఏదైనా కొత్తగా చేయరా.. అని అన్నయ్య తనతో అన్నట్లు సాయి కుమార్ చెప్పారు.

Recommended Video

Gold Medal Movie Team Exclusive Interview
మెగాస్టార్ కు సమాధానం ఇచ్చిన సాయి కుమార్

మెగాస్టార్ కు సమాధానం ఇచ్చిన సాయి కుమార్

ఇక మెగాస్టార్ ఆ విధంగా బూస్ట్ ఇవ్వడంతో సాయి కుమార్ దానికి సమాధానంగా.. అన్నయ్య నేను ఈ సినిమాలో కొత్తగా ఉంటాను. SR కళ్యాణమండపంలో పాత్ర మిమ్మల్ని ఒక లెవెల్ కు సంతృప్తి పరిస్తుందని అనుకుంటున్నాను.. అని సాయి కుమార్ కామెంట్ చేశారు. అంతే కాకుండా ముందు ముందు ఇలాంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో తనలోని కొత్త నటుడిని బయటకు తీస్తానని కూడా ధీమా వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X