»   » దాడి చేసారని స్టార్ హీరోపై నేరారోపణ

దాడి చేసారని స్టార్ హీరోపై నేరారోపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: రెండేళ్ల క్రితం ఓ హోటల్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రవాస భారతీయ వ్యాపారవేత్తతోపాటు అతని మామపైనా దాడి చేశారనే ఫిర్యాదుపై బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ సహా ముగ్గురిపై స్థానిక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. 'సైఫ్‌తోపాటు అతని మిత్రులు షకీల్‌ లడక్‌, బిలాల్‌ అమ్రోహిలపై గురువారం అభియోగం నమోదైంది' అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వజీద్‌ షేక్‌ వెల్లడించారు. 2012 ఫిబ్రవరి 22న తాజ్‌ హోటల్‌లోని వసాబీ రెస్టారెంట్‌లో తనపై సైఫ్‌, అతని స్నేహితులు దాడి చేశారని ప్రవాస భారతీయ వ్యాపారవేత్త ఇక్బాల్‌ మిర్‌ శర్మ ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే... రెండేళ్ల క్రితం ఒక హోటల్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన ఒక ప్రవాస భారతీయ వ్యాపారవేత్తతో పాటు అతని మామపైనా దాడి చేశారనే ఫిర్యాదుపై బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ సహా ముగ్గురిపై స్థానిక కోర్టు గురువారం అభియోగాలు నమోదు చేసింది. భారతీయ శిక్షా స్మృతిలోని రెండు సెక్షన్ల కింద సైఫ్‌తో పాటు అతని మిత్రులు షకీల్‌ లడక్‌, బిలాల్‌ అమ్రోహిలపై గురువారం అభియోగం నమోదైంది అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వజీద్‌ షేక్‌ వెల్లడించారు. 2012 ఫిబ్రవరి 22న తాజ్‌ హోటల్‌లోని వసాబీ రెస్టారెంట్‌లో తనపై సైఫ్‌, అతని స్నేహితులు దాడి చేశారని ప్రవాస భారతీయ వ్యాపారవేత్త ఇక్బాల్‌ మిర్‌ శర్మ ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వారిని బెయిల్‌పై విడిచిపెట్టారు.

సైఫ్‌, తన భార్య కరీనా కపూర్‌, ఆమె సోదరి కరిష్మా కపూర్‌, మలైకా అరోరా, అమృతా అరోరాతో పాటు మరి కొందరు స్నేహతులతో కలిసి రెస్టారెంట్‌కు వచ్చినప్పుడు ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, సైఫ్‌, అతని స్నేహితులు కఠిన పదజాలంతో మాట్లాడుతుండగా అడ్డు చెప్పినందుకు వారు శర్మపై దాడి చేశారు. ఈ ఘటనలో తన ముక్కుకు తీవ్ర గాయమైందని, తన మామ రామన్‌ పటేల్‌పైనా వారు దాడి చేశారని బాధితుడు పోలీ సులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తమతో వచ్చిన మిహళలను శర్మ రెచ్చగొట్టేలా మాట్లాడి, దుర్భాషలాడడమే ఘర్షణకు దారి తీసిందన్నది సైఫ్‌ వాదన. ఈ ఉదంతంపై అదే ఏడాది డిసెంబర్‌లో పోలీసులు చార్జిషీట్‌ నమోదు చేశారు.

English summary
Bollywood actor Saif Ali Khan was on Thursday charged for assaulting South African businessman Iqbal Sharma at Mumbai's Taj Hotel in February 2012, reports said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu