»   »  సత్ర్పవర్తన: నటుడు సంజయ్ దత్‌ విడుదలవుతున్నాడు!

సత్ర్పవర్తన: నటుడు సంజయ్ దత్‌ విడుదలవుతున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అక్రమాయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు ఆయన శిక్ష అనుభవించాల్సి ఉన్నా....8 నెలల ముందుగానే విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 27న అతనిని విడుదల చేయడానికి మహారాష్ట్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. జైల్లో సంజయ్‌దత్ ప్రవర్తన చాలా బావుందని, సత్ర్పవర్తన కారణంగా అతన్ని ముందుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నిర్ణయంతో ఆయన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, బాలవుడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేసాయి. ముఖ్యంగా ఆయనతో సినిమాలకు కమిటైన పలువురు నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. సంజయ్ దత్ విడుదలవుతుండటంతో పెండింగులో ఉన్న సినిమాల మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Actor Sanjay Dutt To Be Released From Jail On February 27

1993 ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్‌దత్ వద్ద ఆయుధాలు లభించాయి. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ గతేడాది మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

English summary
Actor Sanjay Dutt, jailed in an arms case related to the 1993 Mumbai blasts, will be released on February 27. Sources say the reprieve has been granted on grounds of good behaviour.
Please Wait while comments are loading...