Don't Miss!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
రివాల్వర్‌తో సప్తగిరి హల్‌చల్.. ఎక్కడ.. ఎప్పుడు..
టాలీవుడ్ లో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకొన్న సప్తగిరి హీరోగా సప్తగిరి ఎక్స్ ప్రెస్‌తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు పొందిన సప్తగిరి కేవలం హాస్యానికే పరిమితం అవ్వకుండా నవరసాల్ని పండిచగలనని సప్తగిరి ఎక్స్ ప్రెస్‌తో నిరూపించుకున్నారు. ప్రస్తుతం హీరోగా తన రెండో సినిమా రివాల్వర్ రాజు చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు.

రివాల్వర్ రాజుగా ద్వితీయ చిత్రం
హాస్య నటుడిగా సినిమాల్లో నటిస్తూనే మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సప్తగిరి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి "రివాల్వర్ రాజు" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సప్తగిరి ప్రకటించారు. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని విడుదల చేస్తామని సప్తగిరి తెలిపారు.

నాగచైతన్య చిత్రంలో కమెడియన్‌గా
ప్రస్తుతం నాగచైతన్య, కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కమెడియన్‌గా నటిస్తూ తన మార్కు హాస్యాన్ని పండించేందుకు రెడీ అవుతున్నాడు సప్తగిరి.

శర్వానంద్, నాగ అన్వేష్ చిత్రాల్లో..
అలానే యంగ్ హీరోలు శర్వానంద్, నాగఅన్వేష్ తదితరుల చిత్రాల్లో కూడా సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నాడు. వీటితో పాటే హీరోగా తన ద్వితీయ చిత్రానికి సంబంధించిన పనుల్లో కూడా సప్తగిరి బిజీగా ఉన్నారు.

పరుగు ప్రారంభించి 50 చిత్రాల దిశగా..
పరుగు చిత్రంతో కెరీర్‌ను ఆరంభించిన సప్తగిరి దాదాపు 50 చిత్రాల్లో కమెడియన్‌గా నటించారు. ప్రేమ కథా చిత్రం, ఎక్స్‌ప్రెస్ రాజా, లవర్స్ చిత్రాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హీరోగా మారారు.