Just In
- 29 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 49 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 1 hr ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- Sports
మహ్మద్ సిరాజ్కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘వెన్ను పోటు’ సాంగ్ వివాదం: నేనే ప్రత్యక్ష సాక్షి... రామ్ గోపాల్ వర్మకు శివాజీ కౌంటర్!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన 'వెన్నుపోటు' సాంగ్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఎన్టీ రామారావును ఆయన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎత్తి చూపే విధంగా ఈ పాట చిత్రీకరించారు అంటూ టీడీపీ శ్రేణులు మండి పడుతున్నాయి.
తాజాగా ఈ వివాదంపై నటుడు శివాజీ స్పందించారు. ''లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది లక్ష్మి పార్వతి జీవితానికి సంబంధించిన సినిమా. అందులో రామారావుగారి పాత్ర ఏమిటనేది చెబుతాడనుకుంటా నాకైతే తెలియదు. ఇటీవల విడుదలైన సాంగ్ విన్నతర్వాత నాకు ఒకటే అనిపించింది. వెన్ను పోటుకు, వెన్ను దన్నుకు తేడా తెలియని ఒక మనిషి ఈ సినిమా తీస్తున్నాడనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.'' అని తెలిపారు.

రాముడు ఎలా చేశాడో...
రామాయణంలో రాముడు వాలిపై చెట్టు చాటు నుంచి బాణం వేసినపుడు దాని వెనక ఉన్న పరమార్థం వేరు. సుగ్రీవుడి భార్యను చెరపట్టి రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకుని తమ్ముడిని రాజ్య బహిష్కరణ చేశాడు. అపుడు రాముడు అది ధర్మం కాదని చెప్పి ధర్మానికి అనుకూలంగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే చేశారు.. ఆ రోజు తెలుగు దేశం పార్టీ ఉన్న పరిస్థితికి, లక్ష్మీ పార్వతి ఆ పార్టీని కబ్జా చేయాలనుకున్నారు కాబట్టి, యావత్ పార్టీ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుని, పార్టీని, రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి వైస్ రాయ్ హోటల్ లో ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అది వెన్నుపోటు కాదు వెన్ను దన్ను... అని శివాజీ అభిప్రాయ పడ్డారు.
‘వెన్నుపోటు' వివాదం: థాంక్స్ చెబుతూ మళ్లీ రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ

నేను ప్రత్యక్ష సాక్షిని
వైస్ రాయ్ సంఘటన జరిగినపుడు నేను హైదరాబాద్ వైస్ రాయ్ వద్దనే ఉన్నాను. పొట్ట కూటి కోసం హైదరాబాద్ వచ్చాను. ఆ రోజున అదే చైతన్య రథం మీద చెప్పులు విసిరిన మనిషి కూడా లక్ష్మీపార్వతికి సంబంధించిన మనిషే. ఆ రోజు పరిటాల రవి బస్సుమీద నుంచి దూకారు. ఆ మనిషిని చూసిన తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. చంద్రబాబు చేసింది వెన్నుపోటు కాదు.. వెన్ను దన్ను అని శివాజీ నొక్కి వక్కానించారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎన్టీ రామారావు జీవితంలోని పలు వివాదాస్పద అంశాల ఆధారంగా రూపొందుతోంది. రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

ఎన్టీఆర్ బయోపిక్-ఇటు లక్ష్మీస్ ఎన్టీఆర్
ఓ వైపు ఎన్టీ రామారావు జీవితంపై ఎన్టీఆర్ బయోపిక్ వస్తుండగా... అందులో చూపించని వివాదాస్పద అంశాలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.