»   » ఆమరణ దీక్షకు దిగుతా : సర్కారుపై హీరో శివాజీ ఫైర్

ఆమరణ దీక్షకు దిగుతా : సర్కారుపై హీరో శివాజీ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ నటుడు శివాజీ పాలెం బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలిచారు. వెంటనే ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నెల 15 లోగా సర్కారు స్పందించాలని...లేకుంటే 16వ తేదీన ఆమరణ దీక్షకు దిగుతానని తెలిపారు.

పలు ప్రైవేటు బస్సులు సరైన భద్రత నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నాయని, అలాంటి బస్సులను కట్టడి చేయలేని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ముమ్మాటికీ సర్కారు హత్యే అని శివాజీ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే రూ. లక్ష పరిహారంతో బాధితుల కుటుంబాలు ఎన్నాళ్లు జీవిస్తాయని ఆయన ప్రశ్నించారు.

రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్ల కోసమే పని చేస్తున్నాయని, రాజకీయాలు పక్కనపెట్టి బాధితులకు చేకూత అందించడానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. నేనొక వాలంటీర్‌గా వచ్చా...రేపు నాకూ ఇలాంటి అన్యాయం జరుగొచ్చు...అందుకే మానవత్వంతో వచ్చా... ఇంత మంది బాధ పడుతుంటే చూడలేక వచ్చా....అందరూ బాగుండాలనేదే తన ఆకాంక్ష అని శివాజీ చెప్పుకొచ్చారు.

పర్సనల్‌గా నేను వారికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయక పోయినా....వారి తరుపున పోరాడటానికి సిద్దంగా ఎన్నానని, ఈ పోరాటంలో తాను జైలుకు వెళ్లడానికైనా సిద్దమని శివాజీ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద కల్వర్టును ఢీకొట్టి నిప్పంటుకోవడంతో గాఢ నిద్రలో ఉన్న ఆ బస్సులోని 46 మంది ప్రయాణీకులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

English summary
Actor Shivaji supports palem bus victims. Shivaji demands justice for Palem bus fire victims.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu