చంద్రబాబు నాయుడిపై సోనుసూద్ సెన్సేషనల్ కామెంట్స్.. అంతా ఆయన వల్లే అంటూ..

కరోనావైరస్ ఫస్ట్ వేవ్ సందర్భంగా సమాజ సేవకు నడుము కట్టిన విలక్ష నటుడు ఎంతో అద్బుతమైన సేవలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంటున్నారు. మేధావుల నుంచి సామాన్య ప్రజల వరకు సోను సూద్ సేవలకు ముగ్దులువుతున్నారు. అయితే ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే రియల్ హీరో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. దేశం గర్వించదగిన నటుడు చేసిన కామెంట్లు.. అతడి వ్యక్తిగత వివరాల్లోకి వెళితే...

కరోనావైరస్ ఫస్ట్ వేవ్‌లో

కరోనావైరస్ ఫస్ట్ వేవ్‌లో

కోవిడ్19 ఫస్ట్ వేవ్ సమయంలో వలస కార్మికులు అండగా నిలిచిన ఏకైక సెలబ్రిటీ సోనుసూద్. ఎంతో మంది వలస కార్మికులను ట్రైన్స్, బస్సు, విమానాల్లో తమ సొంతూళ్లకు చేర్చి వారి కన్నీటి బాధలకు సుఖాంతం పలికారు. అంతేకాకుండా ఆర్థికంగా సమస్యలు పడే వారికి అండగా నిలిచారు. అలా దేశవ్యాప్తంగా సోనుసూద్ అందరి వాడిగా నిలిచారు.

కోవిడ్ 19 సెకండ్ వేవ్‌లో

కోవిడ్ 19 సెకండ్ వేవ్‌లో

ఇక సెకండ్ వేవ్‌ మరింత ప్రమాదకరంగా మారడంతో సోను సూద్ మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా బారిన పడి మృత్యువుతో పోరాటం చేస్తున్న వారికి ఆక్సిజన్ సిలెండర్లు, కాన్సంట్రేటర్లను సరఫరా చేసి ఎంతో మందిని ఆదుకొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను పెట్టారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఆర్థిక సహాయం చేస్తూ సోను సూద్ అందర్ని ఆకట్టుకొంటున్నారు.

నేషనల్ టెలివిజన్‌తో సోను సూద్

నేషనల్ టెలివిజన్‌తో సోను సూద్

కరోనావైరస్ సమయంలో ఎన్నో రకాలు సమాజ సేవలు చేస్తున్న సోనుసూద్ తాజాగా జాతీయ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సెన్సేషనల్ కామెంట్ చేశారు. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌ను గణనీయంగా అభివృద్ధి చేశాడు అంటూ సొనుసూద్ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు విజన్ గొప్పగా

చంద్రబాబు విజన్ గొప్పగా

ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు చేసిన సేవలను నా సహ ఉద్యోగులకు, సహ నటులతో చర్చిస్తుంటాను. అభివృద్ధి ఎజెండాగా ఆయన విజన్‌ గురించి నేను గొప్పగా చెప్పుకొంటాను అని ఆయన అన్నారు. ఆయన అమలు చేసిన విధానాల వల్ల హైదరాబాద్‌లో మౌళిక సదుపాయాలు బాగా పెరిగాయి. హైదరాబాద్‌కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది అని సోనుసూద్ అన్నారు.

సోను సూద్ కెరీర్ గురించి

సోను సూద్ కెరీర్ గురించి

సోను సూద్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్డౌన్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమాలోను, హిందీలో పృథ్వీరాజ్, తమిళంలో తమిళ్ రాసన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X