For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నీ ఇంట్లోని ఆడవాళ్లే నీపై ఉమ్మేయాలి: ఎమ్మెల్యేపై సుధీర్ బాబు ఆగ్రహం

  |

  పద్మావతి సినిమా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మిస్తున్న ప‌ద్మావ‌తి చిత్రంపై దేశ వ్యాప్తంగా ఆంద‌ళ‌న‌లు వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. బాలీవుడ్ మూవీ పద్మావతి వివాదం మరింత పెద్దదవుతోంది. చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇఫ్పటికే దేశవ్యాప్తంగా సెగలు రాజేస్తుండగా ఇపుడు ఆ మాటల మంటలు తెలంగాణకు చేరాయి. తాజాగా ఆ సినిమాను నిషేధించాలని కోరుతూ ర్యాలీ కూడా తీశారు.

  ఔరంగజేబుపై సినిమా

  ఔరంగజేబుపై సినిమా

  ఈ సినిమాను ప్రదర్శిస్తే ధియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు. రాజ్‌పుత్‌ల గౌరవానికి ఎవరు భంగం కలిగించినా సహించబోమన్నారు. సికింద్రాబాద్‌లో మంగళవారం జరిగిన రాజస్థాన్‌ రాజ్‌పుత్‌ సమాజ్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మహ్మద్‌ ప్రవక్త, ఔరంగజేబుపై సినిమా తీయాలని సంజయ్‌లీలా భన్సాలీకి సవాల్‌ విసురుతున్నా. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నార"ని ధ్వజమెత్తారు.

  ఇంట్లోని మహిళలే ఉమ్మేయాలి

  ఇంట్లోని మహిళలే ఉమ్మేయాలి

  అయితే... ఆయన రీసెంటుగా ఓ చర్చావేదికలో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఫిలిం ఇండస్ర్టీకి చెందిన మహిళలు రోజుకో భర్తను మారుస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తీవ్రంగా ఆగ్రహించారు. ఇలాంటి వ్యాఖ్యలుచేసిన రాజాసింగ్ పై ఆయన ఇంట్లోని మహిళలే ఉమ్మేయాలంటూ ట్వీట్ చేశారు.

  బీజేపీ ఎమ్మెల్యే

  బీజేపీ ఎమ్మెల్యే

  అయితే... బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సుధీర్ బాబు అంత తీవ్రంగా స్పందించినా కూడా ఇతర టాలీవుడ్ నటులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. మహిళలను అంతలా కించపరిచేలా ఉన్న ఆ వ్యాఖ్యలపై కనీసం తెలుగు సినీ రంగానికి చెందిన మహిళలు కూడా ఖండించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

  సుధీర్ బాబు స్పందనకు మద్దతు

  సుధీర్ బాబు స్పందనకు మద్దతు

  సోషల్ మీడియాలో నెటిజన్లు సుధీర్ బాబు స్పందనకు మద్దతు పలుకుతున్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అదేసమయంలో మిగతా టాలీవుడ్ దీనిపై ఏమాత్రం స్పందించకపోవడాన్నీ తప్పు పడుతున్నారు. "రాజా సింగ్.. సిగ్గు.. సిగ్గు.. మహిళలంటే నీకున్న అభిప్రాయం ఇదా. నీ ఇంట్లోని ఆడవాళ్లే నీపై ఉమ్మేయాలి" అంటూ సుధీర్ బాబు చేసిన ట్వీట్ ను పలువురు రీట్వీట్ చేస్తున్నారు.

  తమిళనాడు నటులు

  అంతేకాదు... పొరుగునే ఉన్న తమిళనాడుకు చెందిన నటులు కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్ వంటివారు అనేక అంశాలపై ప్రభుత్వాలను, ఆకృత్యాలను ప్రశ్నిస్తుంటే తెలుగు నటులు మాత్రం ఏం జరుగుతున్నా... చివరకు తెలుగు సినీ మహిళలను కామెంట్ చేసినా స్పందించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

  English summary
  Hero Sudheer Babu breathed fire on BJP Legislator Raja Singh for allegedly making derogatory comments on the women in Film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X