»   »  అచ్చం మహేశ్‌బాబులానే.. అదరగొట్టిన మేనల్లుడు!

అచ్చం మహేశ్‌బాబులానే.. అదరగొట్టిన మేనల్లుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ నటించిన విన్నర్ చిత్రం విడుదలైన తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ, హీరో సుధీర్ బాబు ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ చిత్రంలో సుధీర్ నటించకున్న ఎందుకు సంతోషపడిపోతున్నారా అని ఆలోచిస్తున్నారా?. విన్నర్ చిత్రంలో హీరో సుధీర్ కుమార్ తనయుడు చరిత్ నటించి పలువురిని ఆకట్టుకోవడమే.

 మేనమామ మాదిరిగానే చరిత్

మేనమామ మాదిరిగానే చరిత్


విన్నర్ చిత్రంలో చిన్నప్పటి సాయి ధరమ్ తేజ్‌గా చరిత్ నటించాడు. సినిమాకు పూర్తిస్థాయిలో దోహదపడే కీలక సన్నివేశాల్లో నటించాడు. తండ్రిపై ద్వేషంతో ఇంటిని నుంచి పారిపోయే సన్నివేశం దర్శకుడు గోపిచంద్ చక్కగా చిత్రీకరించాడు. ఈ సన్నివేశంలో చరిత్ పరుగెడుతుండగా వెనుక గుర్రాలు అతడిని వెంటాడినట్టుగా ఉంటుంది.

 అచ్చు మేనమామ మహేశ్‌బాబు

అచ్చు మేనమామ మహేశ్‌బాబు


‘ఈ సన్నివేశంలో చరిత్ పరుగు అచ్చు అతడి మామ మహేశ్‌బాబులా ఉంది' అని హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. చరిత్ నటనను తండ్రి సుధీర్ బాబు చూసి పొంగిపోయాడు.

 తనయుడికి సుధీర్‌బాబు ప్రశంస

తనయుడికి సుధీర్‌బాబు ప్రశంస


చరిత్ చాలా రిస్కీ సన్నివేశాల్లో నటించాడు. గుర్రాల ముందు పరుగెత్తడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ సన్నివేశంలో నటించేటప్పుడు చరిత్ భయపడ్డాడు. కానీ చాలా చక్కగా సీన్ పూర్తి చేశాడు అని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.

 చరిత్ తొలిసారి భలే భలే..

చరిత్ తొలిసారి భలే భలే..


చరిత్ సినీ రంగ ప్రవేశం నానీ నటించిన భలే భలే మొగాడివోయ్‌లో జరిగింది. ఆ చిత్రంలో చిన్నప్పటి నానీగా కనిపించాడు. ఆ చిత్రంలోనూ చరిత్ తన నటనతో ఆకట్టుకొన్నాడు. సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన విన్నర్ చిత్రం ఫిబ్రవరి 24న తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలివారంలో మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది.

English summary
Actor Sudheer Babu is on the cloud nine. Mahesh Babu's Newpew is proud of Sai Dharam Tej and Rakul Preet Singh starrer ‘Winner’. The reason behind, why is Sudheer Babu proud of winner is that his loving son Charith played the role of young Sai Dharam Tej in Winner and performed some risky shots.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu