»   »  ఎన్టీఆర్ తర్వాత స్థానం నాకే దక్కింది: సుమన్

ఎన్టీఆర్ తర్వాత స్థానం నాకే దక్కింది: సుమన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పరిశ్రమలో 37 ఏళ్లుగా 350 సినిమాల్లో నటించానని, దేవుడి పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ తరువాతి స్థానం తనకు దక్కిందని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. ఇటీవల ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ‘జై తెలంగాణ' అన్నది తానొక్కడినే అన్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం రెండువేల ఎకరాలు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందకరం అన్న ఆయన... హైదరాబాద్ ను సినిమా రాజధాని చేయాలన్నారు. సినిమా షూటింగులకు హైదారాబాద్ అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతమన్నారు. తెలంగాణలో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారని, వారిని తాను ప్రోత్సహిస్తానని చెప్పారు.

 Actor Suman about Senior NTR

సినిమా అంశాలతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రానికోవిధంగా ఉండకుండా జాతీయ స్థాయిలో అందరికీ సమాన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళుతానన్నారు.

ప్రజలను కాపాడే క్రమంలో అమరులయ్యే పోలీసు, జవాన్ కుటుంబాలకు భారీగా పరిహారం ఇవ్వాలని, అన్ని రకాల ప్రయోజనాలతో కలుపుకుని ఒక్కో కుటుంబానికి రూ. కోటి వరకు పరిహారం అందిస్తే వారికి అన్ని విధాలా బావుంటుందన్నారు. తన తల్లిదండ్రుల స్పూర్తితో పేదలకు విద్యాపరంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

English summary
"After Senior NTR, I got best God roles as actor" Suman said.
Please Wait while comments are loading...