Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
రాజశేఖర్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ‘మా’ వివాదంపై సుమన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణలో జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఆరోజు చిరంజీవి ప్రసంగిస్తూ.. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడును చెవిలో చెబుదామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మాట్లాడుతున్న పరుచూరి గోపాల కృష్ణ నుంచి మైకు లాక్కున్న రాజశేఖర్ చిరు ప్రసంగంపై ఫైర్ అయ్యాడు. ఇష్టమొచ్చినట్టుగా రెచ్చిపోయిన రాజశేఖర్.. సభ నుంచి వెళ్లిపోవడం, సినీ పెద్దలంతా ఫైర్ అవ్వడం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సుమన్ స్పందిస్తూ ఆయన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

తిరుమలలో సుమన్..
సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నలభై ఏళ్లు పూర్తైన సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు సుమన్. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ముచ్చటించాడు. ఆ క్రమంలో మా వివాదంపై స్పందించాడు. మా వివాదం, చిరంజీవి సూచన, రాజశేఖర్ తీరు, పెద్దల ఆగ్రహం ఇలా ప్రతీ ఒక్క విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

చిరంజీవి బాగా చెప్పాడు..
మా వివాదంపై మాట్లాడుతూ.. ‘డైరీ ఆవిష్కరణ రోజు మంచి ఉంటే మైకులో మాట్లాడదాం.. చెడుని చెవిలో చెప్పుకుందాం అని చిరంజీవిగారు బాగా చెప్పారు. `మా`లోని సమస్యలను అంతర్గతంగా చర్చించుకుని ఉండుంటే బావుండేది. కానీ సమసస్యలు పరిష్కారం కాకపోవడంతోనే రాజశేఖర్ అలా స్పందించారు. రాజశేఖర్ ‘మా'కు ఎంతో సేవ చేశారు.

తప్పు జరిగింది..
అయితే డైరీ ఆవిష్కరణ వేడుకలో రాజశేఖర్ ఆ విషయాలను చర్చించకుండా ఉండాల్సింది. తప్పు జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. మీడియా ముందు ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు మనం అంతర్గతంగా ఎలా సర్దబాటు చేసుకుంటామో.. అలాగే వ్యవహరించాలి' అని చెప్పుకొచ్చాడు.
Recommended Video

రాజీనామా చేసిన రాజశేఖర్..
మా డైరీ ఆవిష్కరణలో జరిగిన రచ్చతో రాజశేఖర్‌పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని చిరంజీవి సూచించిన సంగతి తెలిసిందే. అయతే రాజశేఖరే స్వయంగా తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు చిరంజీవితో ఎలాంటి గొడవలు లేవనీ, కేవలం నరేష్‌తో విబేధాలున్నాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.