For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవితోనే కాంపిటీషన్, బ్లూ ఫిల్మ్ కేసులో ఆ లేడీ ఇరికించిందా?... సుమన్ స్పందన

By Bojja Kumar
|

ప్రముఖ తెలుగు నటుడు సుమన్ 1980ల్లో టాప్ హీరోగా వెలుగొందాడు. సుమన్, చిరంజీవి దాదాపు ఒకే సమయంలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే చిరంజీవి వరుస విజయాలతో మెగాస్టార్ అయ్యాడు. సుమన్ ఓ బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుక్కోవడం వల్ల కెరీర్ మీద చాలా దెబ్బ పడింది. తర్వాత హీరోగా హిట్లు కూడా తగ్గడంతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలయ్యారు.

సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుక్కున్నపుడు రకరకాల ప్రచారం జరిగింది. సుమన్‌ను ఇండస్ట్రీలో ఎదగనీయకుండా తొక్కేయడానికే ఆయన పోటీ దారులు ఆయన్ను కేసులో ఇరికించారని ప్రచారం జరిగింది. అందులో చిరంజీవి పేరు కూడా వినిపించింది. అయితే అనేక సందర్భాల్లో సుమన్ కూడా ఈ విషయాన్ని ఖండించారు. అలాంటిదేమీ లేదన్నారు. సుమన్ ఈకేసులో ఇరుక్కోవడానికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ అమ్మాయి హస్తం ఉందనే వార్తలు కూడా అప్పట్లో హల్ చల్ చేశాయి.

ఆ అమ్మాయి గురించి స్పందించిన సుమన్

ఆ అమ్మాయి గురించి స్పందించిన సుమన్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ లేడీ ఇష్యూ గురించి మాట్లాడుతూ... ఒక లేడీతో మాట్లాడితే రకరకాలుగా మాట్లాడుకోవడం సహజమే. ఆవిడతో నాకు పరిచయం ఉన్న మాట నిజమే. అప్పట్లో వీడియో క్యాసెట్లు బాగా పాపులర్. అవి చెన్నైలో ఒక వీడియో లైబ్రరిలో దొరికేవి. నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ లైబ్రరికి వచ్చి యాక్షన్ పార్టు ఉన్న క్యాసెట్లను తీసుకుని వెళ్లేవాడిని.

అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే వారు. అందులో కొందరు గర్ల్స్ కూడా ఉండే వారు. అందులో ఈ అమ్మాయి కూడా ఉండేదని సుమన్ తెలిపారు.

కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే

కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే

ఆ లైబ్రరీలో కూర్చుని కాసేపు మాట్లాడేవారం. నేను సినిమా కబుర్లు చెప్పడం లాంటివి జరిగేవి. అప్పట్లో ఛానల్స్ లేవు. సినిమా షూటింగ్ ఎలా జరిగింది అనేది నన్ను అడిగి తెలుసుకునే వారు. ఇవి మాట్లాడుకుని వెళ్లి పోవడం తప్ప, క్లోజ్ రిలేషన్ షిప్, ఎఫైర్ లాంటివే లేదు. ఆ లేడీ ఆల్రెడీ మ్యారీడ్. నాకు అభిమాని. ఆ వీడియో లైబ్రరీలో ఒక పార్ట్‌నర్ గా ఉండే వారు. నా కోసం ప్రత్యేకంగా నాకు కావాల్సిన చైనీస్ యాక్షన్ ఫిల్మ్ సీడీలు తీసి పెట్టే వారు. ఆ క్యాసెట్ల విషయంలో మా మధ్య క్లోజ్ రిలేషన్ షిప్ తప్ప, వేరే ఎలాంటి రిలేషన్ లేదు... అని సుమన్ తెలిపారు.

అప్పట్లో నాకు చిరంజీవే కాంపిటీషన్

అప్పట్లో నాకు చిరంజీవే కాంపిటీషన్

నేను 1980ల్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయ్యాను. ఆ టైమ్‌లో నాతో పాటు కాంపిటీషన్లో ఉన్నది చిరంజీవిగారే. ఇంకా బాలకృష్ణ గారు రాలేదు. అప్పట్లో తమ మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండేది అని సుమన్ తెలిపారు.

చాలా బ్యాడ్ టైమ్

చాలా బ్యాడ్ టైమ్

అప్పట్లో కథ కంటే కూడా సాంగ్స్, డాన్సులు, ఫైట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉండేది. నేను ఒరిజినల్ గా కరాటే మాస్టర్ గా ఉండటంతో ఫైట్స్ మీద ఎక్కువ పాషన్ ఉండేది. ఒక స్టేజీలో బ్యాడ్ టైమ్ మొదలవ్వడం డిసప్పాయింట్మెంట్. అందులో నుండి బయటకు రావడానికి చాలా టైమ్ పట్టింది. ఆ బ్యాడ్ టైమ్ లో కూడా కంచు కవచం అనే సినిమా రిలీజ్ అయితే 100 డేస్ ఆడింది. ఆడియన్స్ లో నా మీద ఇంకా ఎఫెక్షన్ ఉంది, లవ్ ఉంది అని ధైర్యం వచ్చింది. మల్లీ ఇండస్ట్రీకి వచ్చాను అని సుమన్ తెలిపారు.

నా బ్యాగ్రౌండ్ పూర్తిగా వేరు

నా బ్యాగ్రౌండ్ పూర్తిగా వేరు

యాక్టర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మా మదర్ కాలేజీ ప్రిన్సిపల్, ఎడ్యుకేషనల్ బ్యాగ్రౌండ్. ఫాదర్ ఇండియన ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్ గా ఉండేవారు. మాకు సినిమా ఫీల్టుతో సంబంధం లేదు, తెలుగు ఫీల్డుతో అసలు సంబంధం లేదు... అని సుమన్ తెలిపారు.

అతడే నన్ను ఇటు లాక్కొచ్చాడు

అతడే నన్ను ఇటు లాక్కొచ్చాడు

నేను తమిళ ఫీల్డులో ఉన్నపుడు బాలచందర్ అనే ఆర్టిస్టు నన్ను తెలుగుకు లాక్కొచ్చి ఇలా చేశారు. తెలుగులో నా సినిమాలు వస్తాయని, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. అయితే నాకు ఇక్కడ వచ్చిన పొజిషన్‌కు, గుర్తింపుకు చాలా గ్రేట్ గా ఫీలయ్యాను... అని సుమన్ తెలిపారు.

చిరంజీవి సినిమాల్లో చేయడానికి ఫీలవ్వలేదు

చిరంజీవి సినిమాల్లో చేయడానికి ఫీలవ్వలేదు

తమిళంలో ముందు నేను యాక్టర్ అయిన తర్వాత పెద్ద సినిమాలు చేయాలి, పెద్ద డైరెక్టర్ చేయాలి ఇలా ఏమీ అనుకోలేదు. మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని ఉండేది. అందుకే నేను తర్వాత చిరంజీవి గారి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి కూడా ఎప్పుడూ ఫీలవ్వలు లేదు.... అని సుమన్ తెలిపారు.

39 సంవత్సరాలైంది

39 సంవత్సరాలైంది

ఇండస్ట్రీకి వచ్చి 39 సంవత్సరాలు అవుతోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఒరియా, ఒక హాలీవుడ్ సినిమా చేశాను. కొన్ని క్యారెక్టర్లకు సుమన్ అయితేనే బావుంటుందనే పేరొచ్చింది. డివోషనల్ రోల్స్ కు నేను అయితేనే కరెక్టర్ అనే ముద్ర పడింది, ఆడియన్స్ నుండి యాక్సెప్టెన్స్ వచ్చింది.. అని సుమన్ తెలిపారు.

సుమన్ ఎందుకు వేస్టు అనొద్దు

సుమన్ ఎందుకు వేస్టు అనొద్దు

చిరంజీవిగారి సినిమాగానీ, బాలకృష్ణ గారి సినిమా గాని అసలు ఆ క్యారెక్టర్ ఏమిటి, ఆ కాంబినేషన్ తో చేస్తే బావుంటుందా? లేదా? అని ఆలోచిస్తాను. దానికి సుమన్ కరెక్టర్ అనే విధంగా ఉండాలి. సుమన్ ను ఎందుకు పెట్టారు వేస్టు అనే మాట రావొద్దు.... అలా నాకు నచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ వెలుతున్నాను అని సుమన్ తెలిపారు.

ఈ అవకాశం దక్కిన కొంత మందిలో నేనూ

ఈ అవకాశం దక్కిన కొంత మందిలో నేనూ

నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పేరు నాకు ఇండస్ట్రీలో వచ్చింది. చిరంజీవిగారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారితో చేశాను. అంతకు ముందు జనరేషన్లో కృష్ణ గారు, కృష్ణం రాజుగారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారితో చేశాను. రామారావుగారు అప్పటికే పాలిటిక్స్ లోకి రావడం వల్ల చేయలేక పోయాను. ఫస్ట్ జనరేషన్ తో చేశాను, సెకండ్ జనరేషన్ తో చేశాను, ఇపుడు థర్డ్ జనరేషన్ తో చేస్తున్నాను. ఈ అవకాశం దక్కిన కొంత మందిలో నేనూ ఒకడిగా ఉండటం ఆనందంగా ఉంది అని సుమన్ తెలిపారు.

సుమన్ వద్దని చెప్పినా.... చిరంజీవిపై ఆగని ఏళ్లనాటి పుకార్లు!

సుమన్ వద్దని చెప్పినా.... చిరంజీవిపై ఆగని ఏళ్లనాటి పుకార్లు!

అప్పట్లో సుమన్ అన్యాయంగా ఓ కేసులో జైలుకెళ్లారు. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో ఆ రోజుల్లో పెను దుమారానికి కారణం అయింది. ఈ సంఘటన జరిగిన దాదాపు 30 ఏళ్లు జరిగినా, అప్పటి పీడకలను సుమన్ సైతం మరిచి పోయినా.... ఇప్పటికీ కొందరు ఆ విషయాన్ని తెరపైకి తెస్తూ చిరంజీవిని ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Actor Suman Clarifies on His Arrest over Blue Film Controversy. Some gossips are so strong in film industry that they are carrying forward from years. Among one such things, the most silently talked and which is being forced on youngsters is that Megastar Chiranjeevi has killed the career of hero Suman. "he's not responsible for that and he's not such a guy. Chiru is a devotee of Lord Hanuman and he never indulges in such things. In fact, he gave me break by roping me as character artist in his films", said Suman.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more