»   » శ్రీమంతుడు కాన్సెప్టు: దత్తత బాటలో నటుడు సుమన్!

శ్రీమంతుడు కాన్సెప్టు: దత్తత బాటలో నటుడు సుమన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గ్రామాలను దత్తత తీసుకోవడం, అభివృద్ధి చేయడం లాంటి కాన్సెప్టు ఎప్పటి నుండో ఉన్నప్పటికీ మహేష్ బాబు ‘శ్రీమంతుడు' తర్వాత ఇది మరింత పాపులర్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే మహేష్ బాబు, మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇలా పలువురు సినీనటులు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ లిస్టులో ప్రముఖ నటుడు సుమన్ కూడా చేరిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగమయేందుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ ముందుకుకొచ్చారు. ఈ మేరకు ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.

Actor Suman to Adopt a Village in Mahabubnagar

గ్రామాలను దత్తత తీసుకునేందుకు ప్రముఖులు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే టాలీవుడ్ నటులు మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్ ఇద్దరు మహబూబ్‌నగర్ జిల్లాలో చెరో గ్రామాన్ని దత్తత తీసుకున్న దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Actor Suman called on Telangana Information Technology and Panchayati Raj Minister K T Rama Rao in Hyderabad, and expressed his interest to adopt Suddhapally village in Mahabubnagar district
Please Wait while comments are loading...