»   » బోల్డ్‌గా నటిస్తే తప్పేంటి.. అలా హాట్‌హాట్‌గా.. దాని కోసమే చూస్తున్నా.. తేజస్వీ..

బోల్డ్‌గా నటిస్తే తప్పేంటి.. అలా హాట్‌హాట్‌గా.. దాని కోసమే చూస్తున్నా.. తేజస్వీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తేజస్వీ మదివాడకు హీరోయిన్‌గా మంచి పేరు వచ్చింది. కానీ అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. శృంగారతారగా ముద్ర పడినందునే అవకాశాలు దూరమయ్యాయనే వాదనను తేజస్వీ ఖండించింది. ప్రస్తుతం బాబు బాగా బిజీతో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న తేజస్వీని మీడియా అలాంటి అభిప్రాయాలను ఏర్పరుచుకోవడం తగదని స్పష్టం చేసింది.

పాత్రను బట్టి..

పాత్రను బట్టి..

వచ్చిన అవకాశాలను, కథను బట్టి పాత్రల ఎంపిక జరుగుతుంది. సిరిమల్లే చెట్టు చిత్రం ద్వారా మంచి పేరు వచ్చింది. కాకపోతే తొలి చిత్రంలో సపోర్టింగ్ పాత్ర చేయడంతో అలాంటి పాత్రలే వస్తున్నాయి. రాంగోపాల్ వర్మ రూపొందించిన ఐస్‌క్రీం సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.

అలా హాట్ హాట్‌గా..

అలా హాట్ హాట్‌గా..

సినిమా కథ ఎలా ఉంటే అలా నటిస్తాను. ఐస్‌క్రీం సినిమాలో కథను బట్టి హాట్ హాట్‌గా కనిపించాల్సి వచ్చింది. అలా నటించడంలో తప్పు లేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో చాలావరకూ పద్ధతిగానే కనిపించాను. ‘మనం', ‘హార్ట్‌ఎటాక్‌' లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. వాటిని ఎవరూ గుర్తించడం లేదు అని ఆమె అన్నారు. దిల్‌రాజు నిర్మించిన ‘కేరింత'లోని పాత్రకు నాకు మంచి పేరొచ్చిన దానిని ఎవరూ గుర్తించరే అని ఆవేదన వ్యక్తం చేశారు

మంచి పేరు తెస్తుంది..

మంచి పేరు తెస్తుంది..

ప్రస్తుతం నటించిన బాబు బాగా బిజీ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ ఏడాది అవకాశాలు బాగా రావడంతో చాలా బిజీ అయిపోయాను. ఖాళీగా అయితే లేను. ఏదో ఒక క్యారెక్టర్‌ చేస్తూనే ఉన్నాను. కానీ హీరోయిన్‌గా రావలసినంత గుర్తింపు రాలేదనే కొద్దిగా బాధ. కెరీర్ పరంగా నేను సంతోషంగా ఉన్నాను తేజస్వీ తెలిపింది.

టైం కోసం వేచి చూస్తున్నా..

టైం కోసం వేచి చూస్తున్నా..

సినీ పరిశ్రమలో టైమ్ అనేది చాలా ప్రధానం. అవకాశాలతోపాటు స్టార్ హోదా రావడానికి టైం రావాలి. అందుకోసమే వేచిచూస్తున్నాను. ఆలస్యమైనా నా ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

English summary
Actor Tejaswini entered in tollywood with Seetamma Vakitlo sirimalle chettu. she acted as bold girl in RGV's Ice cream movie. Now Tejaswini appearing in bollywood movie Hunterrr's remake Babu Baga busy. Reports says that she acted in very hot scenes with Avasarala Srinivas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu