»   » ఉత్తేజ్‌ కుమార్తె హీరోయిన్ గా ఎంట్రీ

ఉత్తేజ్‌ కుమార్తె హీరోయిన్ గా ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నటుడు, సినీ రచయిత ఉత్తేజ్‌ కుమార్తె చేతన ఉత్తేజ్‌ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆ మధ్యన ఆమె సినీ ఎంట్రీ గురించి వార్తలొచ్చినా.. సోమవారం ఉత్తేజ్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా విషయం ఖరారు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

Happy to share with y'all, my daughter #Chethana's debut movie #She :) Feeling blessed to have a hardworking daughter...

Posted by Uttej on 20 December 2015

షీ అనే చిత్రంలో టైటిల్‌ రోల్‌ వాసుకి పాత్రలో చేతన నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు చిత్రాలను ఉత్తేజ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. తన కుమార్తెను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

Actor Uttej daughter Chetana to become heroine

మహత్‌ రాఘవేంద్ర, చేతన ఉత్తేజ్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘షీ'. ఈజ్‌ వెయిటింగ్‌ ట్యాగ్ లైన్ తో వస్తున్న సినిమాలో శ్వేతమీనన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దీనికి డైరక్టర్ పర్స రమేష్‌ మహేంద్ర. హైదరాబాద్‌లో, పూరి జగన్నాథ్‌ గౌరవ దర్శకత్వంలో ఈసినిమా మెదలైంది. ఈ సినిమాకి కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మాత. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సోదరి రమ్య క్లాప్‌నిచ్చారు. అనూప్‌ సింగ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ఈ సినిమా అన్నపూర్ణ ఫారెస్టు లోకేషన్‌లోని స్మశానవాటిక సెట్‌లో షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం నుంచి చిత్రం షూటింగ్‌ ప్రారంభించి మే లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు.

Actor Uttej daughter Chetana to become heroine

నిర్మాత మాట్లాడుతూ ‘‘వాణిజ్యాంశాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. బోలెడన్ని థ్రిల్లింగ్‌ అంశాలుంటాయి. ఏప్రిల్‌ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఉంటుంది''అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో ఉత్తేజ్‌, కవిత తదితరులు పాల్గొన్నారు.

శ్వేతామీనన్‌, మహత్‌ రాఘవేంద్ర, ఉత్తేజ్‌, సోనియా అగర్వాల్‌ రమాప్రభ, కవిత, పోసాని కృష్ణమురళి, సూర్య, ధన్‌రాజ్‌, చిత్రం శ్రీను తదితరులు ఈ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రానికి పబ్లిసిటి డిజైనర్ : ధని ఏలే, స్టంట్స్ : సతీష్, విజువల్ ఎఫెక్ట్స్ : ఇవ మోషన్ స్టూడియో, కళా దర్శకత్వం : కృష్ణ, ఛాయాగ్రహణం : అనిత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బసంత్ రెడ్డి, సంగీతం : భోలే శావలి.

English summary
comedian, writer Uttej's daughter Chetna is also making her debut with a horror film "She", being directed by a newcomer Ramesh Mahendra.
Please Wait while comments are loading...