»   » మాఎన్నికలు: మురళీ మోహన్‌‌పై వ్యతిరేకతే రాజేంద్రుడి గెలుపు

మాఎన్నికలు: మురళీ మోహన్‌‌పై వ్యతిరేకతే రాజేంద్రుడి గెలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ జయసుధపై విజయం సాధించారు. దాదాపు 83 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. గత కొన్ని రోజులుగా ఎన్నో వివాదాలు, ఆసక్తికరమైన మలుపులు, కోర్టు కేసులతో సాగిన ఈ ఎన్నికలు సమరానికి ఈ రోజు వెలువడిన ఫలితాలతో తెరపడినట్లయింది.

ఈ సందర్భంగా నటుడు విజయ్ చందర్ మాట్లాడుతూ..... గత అధ్యక్షడు మురళీ మోహన్ మీద ఉన్న వ్యతిరేకతే ఈ రోజు రాజేంద్రప్రసాద్ గెలుపుపొందడానకి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మురళీ మోహన్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో చాలా మంది ఆర్టిస్టులు ఇబ్బంది పడ్డారు. ఆయన వల్లే ఆర్టిస్టుల్లో వర్గాలు ఏర్పడ్డాయి. ఇపుడు ఆయన చెప్పిన మాటే నెగ్గాలని నియంతలా వ్యవహరించారు. చివరకు ఈ ఎన్నికల్లో కూడా ఆయన చెప్పిన వ్యక్తే గెలవాలని రాజకీయం చేసారు. ఇంత కాలం మురళీ మోహన్ ఆగడాలను భరిస్తూ వచ్చిన ఆర్టిస్టులు తమ ఓటు హక్కుతో తగిన బుద్ది చెప్పారని' అన్నారు.

Actor Vijay Chandar criticized Murali Mohan

మురళీ మోహన్ అధ్యక్షుడు గా ఉన్న సయమంలో చిన్న ఆర్టిస్టులను అస్సలు పట్టించుకోలేదు. రాజేంద్రప్రసాద్ క్రింది నుండి వచ్చిన వ్యక్తి, ఆయనకు ఆర్టిస్టుల కష్టాలే ఏమిటోబాగా తెలుసు. అందుకే అంతా ఆయన్నే గెలిపించాలని నిర్ణయించుకున్నారు. ఫలితాల్లో అదే వెల్లడయింది అని విజయ్ చందర్ చెప్పుకొచ్చారు.

జయసుధ ఓటమికి కారణం మురళీ మోహన్ మద్దతు ఉండటమే అని పలువురు అభిప్రాయ పడ్డారు. మురళీ మోహన్ ఆము వైపులేకుండా ఉండి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అంటున్నారు. రాజేంద్రప్రసాద్ పేద కళాకారులకు తగిన న్యాయం చేస్తాడనే నమ్మకం ఉన్నారు అంతా.

English summary
Actor Vijay Chandar criticized Murali Mohan.
Please Wait while comments are loading...