»   » హత్యా బెదిరింపు కేసులో విశాల్: స్థలం కబ్జాతోనే గొడవ

హత్యా బెదిరింపు కేసులో విశాల్: స్థలం కబ్జాతోనే గొడవ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సినిమా, రాజకీయాలూ ఈ రెండు రంగాలూ కలిసి పోయి ఉంటాయి. సినీ సంఘాల ఎన్నికలు కూడా పూర్థి స్థాయి రాజకీయ పోకడలతో ఉంటాయి. మొన్నటికి మొన్న నడిగర సంఘం ఎన్నికల సమయం లో ఎంత రచ్చ జరిగిందో చూసిందే కదా. సరే ఆ గొడవలని కూడా అధిగమించి అటు నడిగర్ సంఘానికి ఎన్నికై అంతటితో ఆగకుందా తనని నిషేదించిన నిర్మాతల సంఘానికి కూడా అధ్యక్షుడు గా ఎన్నికయ్యాడు నటుడు విశాల్...

దర్శకుడు సురేశ్‌ కామాక్షి

దర్శకుడు సురేశ్‌ కామాక్షి

అయితే ఇప్పుడు మళ్ళీ ఏమైందో గానీ విశాల్‌ తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ తమిళనిర్మాత, దర్శకుడు సురేశ్‌ కామాక్షి ఆరోపించాడు. ఈ మేరకు స్థానిక వడపళని పోలీస్ స్టేషన్ లో కూడా లిఖిత పూర్వక ఫిర్యాదు చేసాడు. ఆ ఫిర్యాదులోనే తాను నిర్మాతల సంఘానికి ఉపాధ్యక్షుడిగా పోటీ చేసాననీ, నడిగర్ సంఘం కోసం కూదా పని చేస్తూ, నటులూ నిర్మాతల సమస్యల మీద పోరాడుతున్నాననీ అది నచ్చకే విశాల్ తనమీద పగబట్టాడంటూ ఆరోపించాడు.

పక్కవారి స్థలాన్ని ఆక్రమించారు

పక్కవారి స్థలాన్ని ఆక్రమించారు

విశాల్ కీ తనకూ ఎలాంటి వ్యక్తిగత విభేదాలేమీ లేవనీ... అయితే నడిగర్ సంఘం కోసం నిర్మించే భవంతి కోసం పక్కవారి స్థలాన్ని ఆక్రమించారనీ, అందుకే దాని పై మద్రాస్ హైకోర్టు కూడా తాత్కాలికంగా స్టే ఇచ్చిందనీ..ఈ వివరాలను తాను ఫేస్బుక్ లో పెట్టటం తో అదినచ్చకే విశాల్ తనపై బెదిరింపులకు దిగాడనీ చెప్తున్నాడు.

హాత్యాబెదిరింపులు

హాత్యాబెదిరింపులు

అంతే కాకుండా విశాల్‌ తన అభిమానులకు తన సెల్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి హాత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పాడు. విశాల్ అభిమానులుగా చెప్పుకుంటున్న తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్‌ అభిమాన సంఘ అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న కమల్‌కన్నన్, మరో అభిమాని తనపై రౌడీయిజానికి కూదా పాల్పడ్డారని చెప్పటం ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కలకలానికి దారి తీసింది..

కోలీవుడ్ మొత్తం ఇదే చర్చ

కోలీవుడ్ మొత్తం ఇదే చర్చ

ఇప్పుడు కోలీవుడ్ మొత్తం ఇదే చర్చతో గందరగోలగా ఉంది. సురేశ్‌ కామాక్షి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీస్‌ అధికారులు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ విశాల్ ఈ విశయం మీద స్పందించలేదు.

English summary
Tamil Director, Actor Suresh kamakshi filed a complaint on Hero Visal, Suresh complaints Vishal issued death threats to him
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu