»   » హీరోయిన్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కాదు.. నేనేమైనా ఇండియా గేట్‌నా?

హీరోయిన్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కాదు.. నేనేమైనా ఇండియా గేట్‌నా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకు ఇబ్బంది కలిగించిన ఫ్యాన్స్‌పై బాలీవుడ్ తార్ రిచా చద్దా మండిపడింది. సినీ తారలంటే ప్రైవేటు ఆస్తులు కాదని, యాక్టర్ల పరిస్థితిని అర్థం చేసుకోరా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబైలో ఇటీవల ఓ సందర్భంగా ఫొటోలు తీసుకోవడానికి ఎగపడటం, మితిమీరి ప్రవర్తించడంతో ఆమె కోపానికి కారణమైందనే తాజా సమాచారం. మొహమాటం లేకుండా మాట్లాడే రిచా ఆ కార్యక్రమంలో కొందరిని దుమ్ము దులిసినట్టు తెలిసింది.

మేము పబ్లిక్ ఫిగర్లం..

మేము పబ్లిక్ ఫిగర్లం..

ఫొటోగ్రాఫర్లు ఏమనుకుంటారో అర్థం కాదు. యాక్టర్లంటే పబ్లిక్ ఫిగర్స్. కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు. నేను ఏమైనా ఇండియా గేట్‌నా? నేను రోడ్డు పక్కన నిలచుంటే వచ్చి ఫొటోలు దిగడానికి నేనైమైనా కట్టడాన్నా? చెప్పపెట్టకుండా మీదపడి ఎలా ఫొటోలు తీస్తారు అని రిచా చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ పరిస్థితుల్లో ఫొటోలు తీస్తారా?

ఆ పరిస్థితుల్లో ఫొటోలు తీస్తారా?

నేను ఏ పరిస్థితుల్లో కూడా ఉన్నానో గ్రహించకుండా ఫోటోలు ఎలా తీస్తారు. మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆమె పరిస్థితి బాగాలేదు. హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. హాస్పిటల్‌లో బాధలో ఉన్నాను. నా పర్మిషన్ లేకుండా ఫొటోలు తీయడం సరికాదు అని ఆమె మండిపడ్డారు.

అందుకే ఫొటోలు తీయొద్దని వారించా

అందుకే ఫొటోలు తీయొద్దని వారించా

బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు నన్ను ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. అయితే ఫొటోలు తీయవద్దని నేను వారి వారించాను. అప్పుడు నా తల్లిని కారులో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాను. మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇవేమీ గమనించకుండా వారు ఫొటోలు తీయడంతో ఒళ్లు మండింది. ఈ పరిస్థితుల్లో వారిని వారించడం నా తప్పా అని ఆమె నిలదీసింది.

పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..

పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..

మరో రోజు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నా స్నేహితుడి తండ్రి ఇటీవల మరణించాడు. తనకు ఓదార్పు కలిగించాలన్న ఉద్దేశంతో ఓ హోటల్‌కు భోజనం చేయాలని వెళ్లాం. ఆ సందర్భంగా తన తండ్రి గురించి తలుచుకొని కంటతడి పెట్టుకొన్నాడు. నేను కూడా కన్నీళ్లు పెట్టుకొన్నాను. దాంతో మా ఇద్దరి కళ్లు ఎర్రబడ్డాయి. మేము హోటల్‌ నుంచి బయటకు వచ్చాం. ఆ సమయంలో కొందరు ఫొటోల కోసం ఎగబడ్డారు. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని అన్నారు.

ఫొటోలు తీస్తే బాగుంటుందా?

ఫొటోలు తీస్తే బాగుంటుందా?

ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి, చెడులు ఉంటాయి. మేమే మనుషులమే. మాకు భావోద్వేగాలు ఉంటాయి. మేము హ్యాపీగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకొంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు పరిస్థితిని
అర్థం చేసుకోవాలి. అంతేగానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో గ్రహించకుండా ఎడాపెడా ఫోటోలు తీస్తే బాగుంటుందా అని రిచా చద్దా ప్రశ్నించారు.

English summary
Actress Richa Chadha says she does not enjoy the attention of the paparazzi all the time and that people should understand that though actors are public figures, they are not public properties. "I think people should be sensitised on how to be polite with us and that we are also normal human beings... with our good days and bad days. I click pictures with my fans when I am in a good mood, but you also have to understand when we are saying 'no'. It should be respected.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu