For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పొలిటీషియన్ కాదు.. రౌడీలా అంటూ పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ సినీ నటి రోజా

  |

  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటి, ఏపీ మంత్రి రోజా సెల్వమణి విరుచుకుపడ్డారు. ఏపీ రాజకీయాలపై పవన్‌కు అవగాహన లేదని విమర్శించారు. టీడీపీ, బీజేపీ పార్టీలకు దాసోహం అంటూ రాజకీయ పార్టీని నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌‌తో మాట్లాడుతూ.. పవర్ స్టార్‌పై రోజా తీవ్రస్థాయిలో మండిపడుతూ...

  మేము కూడా చెప్పులు చూపిస్తాం

  మేము కూడా చెప్పులు చూపిస్తాం

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న తప్పులను మా పార్టీ నేతలు ఎత్తి చూపిస్తున్నందుకే ఆయనకు కోపం. అందుకే చెప్పు చూపిస్తూ.. గాడిదలు అంటూ ఆక్రోషం వెళ్లగక్కతున్నారు. మమ్మల్ని తిడుతున్నారు. రెండు చోట ఓడిపోయిన ఆయనకే అంత కోపం ఉంటే.. 150కిపైగా నియోజకవర్గంలో గెలిచిన మనకు ఎంత బలం ఉండాలి. మనం కూడా చెప్పులు చూపిస్తే ఆయన ఏమౌతాడు అని రోజా అన్నారు.

  పవన్‌ను పొలిటీషియన్ అంటారా?

  పవన్‌ను పొలిటీషియన్ అంటారా?

  రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు విజన్ లేదు. ఆయన చేసే పనులు ఎవరికీ అర్ధం కాలేదు. ఆయన చంద్రబాబు మాయలో ఉన్నాడు. పచ్చ ఛానెల్లు ఆయనకు పబ్లిసిటీ ఇస్తే.. ఇలా బతికేద్దామని అనుకొంటున్నాడు. మొన్న ఇప్పటం పర్యటనలో ఆయన చూశారుగా.. ఒక రౌడీ మాదిరిగా, ఆయన డ్రస్, హెయిర్ స్టయిల్ చూస్తే బాగాలేదు. కారు మీద రెండు కాళ్లు చాపుకొని ఉన్న ఆయనను పొలిటిషియన్ అంటారా? ఎవరైనా రాజకీయ నాయకుడిగా ఊహించుకొంటారా అని రోజా ప్రశ్నించింది.

  పవన్ కల్యాణ్ బాధ్యాతారాహిత్యంగా

  పవన్ కల్యాణ్ బాధ్యాతారాహిత్యంగా

  ఇప్పటం పర్యటనలో పవన్ కల్యాణ్ బాధ్యాతారాహిత్యంగా కనిపించాడు. ఆ స్పీడ్‌లో వెళితే.. ఎవరికైనా ప్రమాదం జరిగితే.. ఎంత మంది ప్రాణాలు పోతాయి. ఇప్పటంలో అసలు ఏదైనా సమస్య ఉందా? ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడ కట్టుకొంటే.. నోటీసులు ఇచ్చి కూల్చివేశారు. దానికి అంతా సీన్ చేయాల్సిన అవసరం ఉందా? వారికి లక్ష రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని రోజా ఘాటుగా స్పందించారు.

   ప్యాకేజ్ కోసం పవన్ డ్రామాలు

  ప్యాకేజ్ కోసం పవన్ డ్రామాలు

  పవన్ కల్యాణ్‌కు బాధ్యత ఉంటే.. కందుకూరు సభలో చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలవండి. చంద్రబాబు చేసిన నిర్వాకంతో ఎనిమిది మంది చనిపోతే.. ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆ ఎనిమిది కుటుంబాలను పరామర్శించు. వారికి ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకో. ఒక అక్రమ కట్టడానికి ఇచ్చిన విలువను, మనుషుల ప్రాణాలకు ఇవ్వరా? కేవలం ప్యాకేజ్ కోసం డ్రామాలు ఆడుతున్నాడు అని రోజా విమర్శించారు.

  జగన్ వెంట్రుక కూడా పవన్ పీకలేడు

  జగన్ వెంట్రుక కూడా పవన్ పీకలేడు


  ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు పవన్ కల్యాణ్‌కు పట్టవు. ప్రేమ, అభిమానం లేదు. అభివృద్ది చేయాలనే ఆలోచన లేదు అని రోజా అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పవన్ చేసిన కామెంట్‌పై సెటైరిక్‌గా నవ్వుతూ.. జగన్మోహన్ రెడ్డి చిటికెన వేలుపై వెంట్రుకను పవన్ కల్యాణ్ పీకలేడు. వైఎస్ జగన్ హ్యాపీగా జీవితాన్ని గడిపే అవకాశం ఉన్న ప్రజల కోసం కష్టపడుతున్నాడు. తండ్రి చనిపోతే ఆయనను నమ్ముకొన్న ప్రజల కోసం అవమానాలు భరిస్తున్నాడు. అందుకే జగన్‌కు 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. పవన్ మాత్రం ప్రజలు సినిమాలను హిట్ చేస్తే డబ్బులు సంపాదించి పవర్ స్టార్ అయ్యాడు. నీవు రాజకీయాలకు వచ్చి మోడీ, చంద్రబాబుకు దాసోహం అవుతున్నావు అని రోజా అన్నారు.

  English summary
  Actress and YSRCP leader Roja Selvamani fires on Power Star Pawan Kalyan. AP minister Roja made serious allegations on Jana Sena Chief. Here is her comments on the Pawan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X