»   »  వివరణ: అంజలికి పెళ్లయింది, పిల్లలు కూడా పుట్టారంటూ...

వివరణ: అంజలికి పెళ్లయింది, పిల్లలు కూడా పుట్టారంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరోయిన్ అంజలి అప్పట్లో ఎవరికీ కనిపించకుండా పోయి అందరినీ కంగారు పెట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె మళ్లీ అదృశ్యం అయిందంటూ ఈ మధ్య కాలంలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాదు అంజలికి పెళ్లయిందని, పిల్లలు కూడా పుట్టారంటూ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ వార్తలపై అంజలి స్పందిస్తూ.....నేను ఎక్కడికి వెళ్లలేదు. అదంతా అవాస్తవం. పెళ్లి విషయం మీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకోను. నా మేనల్లుడితో ఉన్న ఫోటో చూసి నాకు పిల్లలు పుట్టారంటూ ప్రచారం చేసారు. నాకు పెళ్లి కాలేదు. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను అని అంజలి స్పష్టం చేసింది.

Actress Anjali response about her missing

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో నేను నటిస్తున్నట్లు వార్తలు కూడా విన్నాను. ఇదో పెద్ద కామెడీ న్యూస్. అసలు ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తారో కూడా తెలియడం లేదు. నా గతం గురించి నేను ఆలోచించడం లేదు. గతాన్ని గతంలానే చూస్తాను. అన్ని సమస్యలు తొలగిపోయాయి. ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని అంజలి చెప్పుకొచ్చింది.

ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం లేదనే ప్రశ్నకు అంజలి సమాధానం ఇస్తూ...కార్తీక్ సుబ్బరాజు దర్కత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాను. అయితే ఈ సినిమా కోసం కాస్త బరువుతగ్గాల్సి వచ్చింది. దానికోసం కొన్నికసరత్తులు చేయడం వల్లనే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

English summary
Heroine Anjali created ripples in the past with her missing episode and she was gone missing alleging that her aunt along with her uncle are putting her to torture.
Please Wait while comments are loading...