»   » దర్శకుడితో పడుకున్నావంటూ....అనుష్కకు వేధింపులు

దర్శకుడితో పడుకున్నావంటూ....అనుష్కకు వేధింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మకు తీవ్రమైన వేధింపులు ఎదురయ్యాయి. మహిళల భద్రత అనే అంశంపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన 'దట్ డే ఆఫ్టర్ ఎవ్రీడే' అనే లఘుచిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించిన వెంటనే ఆమెను టార్గెట్ చేసారు.

బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన కమల్ ఆర్ ఖాన్ పేరుతో ఉన్న ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమెను వేధించారు. 'అనురాగ్ కశ్యప్ తో ఎంతసేపు పడుకుంటావు. ఆయన పక్క వేడెక్కించడంలో మజా వస్తుందా. నీకు సినిమా చాన్సులు ఎవరూ ఇవ్వరు' అంటూ ట్వీట్ చేసారు.

ఈ ట్వీట్ తో అనుష్క శర్మ ఒక్కసారి షాకయింది. అది ఫేక్ అకౌంట్ అని గుర్తించని ఆమె.....నిర్మాత, నటుడు అయిన కమల్ ఆర్ ఖాన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చింది. మరో వైపు ఆమె అభిమానులు కూడా అతనిపై తీవ్రమైన విమర్శలు చేసారు.

అయితే....కాస్త లేటుగా అది కమల్ ఆర్ ఖాన్ తో ఉన్న ఫేక్ అకౌంట్ అని తెలుసుకున్న అనుష్క శర్మ తర్వాత అతనికి క్షమాపణ చెప్పింది. అది ఫేక్ అకౌంట్ అని గుర్తించ లేక పోయాను అని స్పష్టం చేసింది. మరో వైపు అనుష్కను ఫేక్ ట్విట్టర్ అకౌంటు ద్వారా వేధింపులకు గురి చేసింది ఎవరు? అనే తేలాల్సి ఉంది.

English summary
B'town actress Anushka Sharma had an unsavoury encounter on micro-blogging page Twitter on Tuesday, after a Twitter user verbally abused her and made derogatory remarks against her. A fake account of Bollywood actor-producer Kamaal R Khan tweeted, "How much you sleep with Anurag Kashyap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu