»   » సినీ సహాయ నటి అపూర్వకు చంపేస్తామని బెదిరింపులు, పోలీస్ కేసు

సినీ సహాయ నటి అపూర్వకు చంపేస్తామని బెదిరింపులు, పోలీస్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమీర్‌పేట : టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ ఇబ్బందుల్లో పడ్డారు. ఆమెను పది మంది రౌడీలు ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులు కంప్లైంట్ చేసింది. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ ఇవ్వమని కోరారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...మదురానగర్‌ సిద్దార్ధనగర్‌లో నివాసముండే అపూర్వ ఈనెల 21న ఫిలింసిటీలో సినిమా షూటింగ్‌ ముగించుకొని వస్తుండగా కారుకు చిన్న ప్రమాదం జరిగింది. దీని విషయం రెండు కార్లలో ఉన్నవారు గొడవ పడ్డారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

Actress Apoorva files police complaint

సోమవారం కొందరు తన ఇంటికొచ్చి కారు ప్రమాదం విషయమై నిలదీసి చంపేస్తామంటూ బెదిరించి వెళ్లారు. ఈ విషయమై ఆమె సంజీవరెడ్డినగర్‌ పోలీసులకు ఆశ్రయించారు. పది మంది రౌడీలు తన ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరిస్తున్నారని అపూర్వసోమవారం ఫిర్యాదు చేశారు.

Actress Apoorva files police complaint

వారి వల్ల తనకు ప్రాణ హాని ఉందన్నారు. ఇంటికి వచ్చిన వారిని గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. అపూర్వ పలు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు. ఆమె మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది చిత్రంతో 2001 లో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సినిమాల్లో సహాయనటిగా చాలా ఫేమస్. ఆమె సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్, టీవి షోలు కూడా చేసారు.

English summary
Tollywood actress Apoorva, allegedly molested by few rowdies. She files a police complaint at SR Nagar Police station, Hyderabad. Apoorva, Telugu Actress Famous for B grade Movies. She acted in Telugu, Tamil and Kannada Movies. She made her debut in Telugu Industry With Maa Avida Mida Ottu Mee Avida Chala Manchidi in 2001.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu