»   » అపూర్వ బెదిరింపుల కేసు, లేటెస్ట్ ఇన్ఫో

అపూర్వ బెదిరింపుల కేసు, లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నిన్న తెలుగు సినీ సహాయ నటి అపూర్వ తనను బెదిరించిన వ్యక్తులపై పెట్టిన కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కేసును ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. అయితే కేసు ఉపసంహరించుకోవటానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు..ఇరు వర్గాలతో రాజీ చేసారా..లేక బెదిరించిన వ్యక్తులే దిగివచ్చి, సారి చెప్పి కేసు విత్ డ్రా చేసేలా చేసేరా అనేవి తెలియాల్సి ఉంది.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే... మదురానగర్‌ సిద్దార్ధనగర్‌లో నివాసముండే అపూర్వ ఈనెల 21న ఫిలింసిటీలో సినిమా షూటింగ్‌ ముగించుకొని వస్తుండగా కారుకు చిన్న ప్రమాదం జరిగింది. దీని విషయం రెండు కార్లలో ఉన్నవారు గొడవ పడ్డారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

Also Read: సినీ సహాయ నటి అపూర్వకు చంపేస్తామని బెదిరింపులు, పోలీస్ కేసు

Actress Apoorva with draw police complaint

సోమవారం కొందరు తన ఇంటికొచ్చి కారు ప్రమాదం విషయమై నిలదీసి చంపేస్తామంటూ బెదిరించి వెళ్లారు. ఈ విషయమై ఆమె సంజీవరెడ్డినగర్‌ పోలీసులకు ఆశ్రయించారు. పది మంది రౌడీలు తన ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరిస్తున్నారని అపూర్వసోమవారం ఫిర్యాదు చేశారు.

వారి వల్ల తనకు ప్రాణ హాని ఉందన్నారు. ఇంటికి వచ్చిన వారిని గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. అపూర్వ పలు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు. ఆమె మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది చిత్రంతో 2001 లో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సినిమాల్లో సహాయనటిగా చాలా ఫేమస్. ఆమె సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్, టీవి షోలు కూడా చేసారు.

English summary
Apoorva is receiving threatening calls from strangers and the actress has registered a complaint yesterday at SR Nagar police station, Hyderabad. But now she has decided to withdraw the case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu