»   » లైంగిక వేధింపులు నిజమే, రాజమౌళికి సారీ చెబుదామనుకున్నా: అర్చన

లైంగిక వేధింపులు నిజమే, రాజమౌళికి సారీ చెబుదామనుకున్నా: అర్చన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు ఉంటాయని, కొందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు అవకాశాల పేరుతో వారిని లొంగదీసుకోవాలని చూస్తారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. ఇలాంటి విషయాలపై కొందరు హీరోయిన్లు గతంలో బహిరంగంగానే స్పందించారు. ఇలాంటివి జరుగుతాయనేది ఓపెన్ సీక్రెట్ అని చెప్పారు.

అయితే తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఇలాంటి సంఘటన గురించి హీరోయిన్ అర్చన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఓ ప్రముఖ నటుడు తనను ఇండైరెక్ట్‌గా అలా అడిన విషయాన్ని అర్చన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

తన సినిమాలో అవకాశమిచ్చిన ప్రముఖ నటుడు షూటింగ్‌ పూర్తయిన తర్వాత 'నీకు అవకాశం ఇచ్చాను కదా.. నాకేమిస్తావ్‌ అని అడిగాడు'. నాకేం చెప్పాలో తెలియలేదు. వెంటనే మీకు ఇచ్చేంత దాన్ని కాదని చెప్పి తప్పించుకున్నాను, ఆ కోపంతో ఆ సినిమాలో నా పాత్రను చాలా వరకు కట్‌ చేసేశారు అని ఆమె తెలిపారు.

ప్రోత్సాహం లేదు

ప్రోత్సాహం లేదు

తెలుగులో హీరోయిన్లు చాలా తక్కువ, ఉన్న కొద్ది మంది నా లాంటి వారికి ఇండస్ట్రీలో ప్రోత్సాహం లేదు. ‘కమలతో నా ప్రయాణం' సినిమా సమయంలో ప్రమోషన్‌ కోసం చాలా మంది సినీ పెద్దలను కలిశానని, కానీ, వారెవరూ తనకు సహాయం చేయలేదని ఆమె తెలిపారు. ఇక్కడ సరైన ప్రోత్సాహం లేకనే ముంబై వెళ్లానని, ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో చేస్తున్నట్లు తెలిపారు.

ఆ సినిమా వల్లే

ఆ సినిమా వల్లే

హీరోయిన్ గా ఎదుగుతున్న రోజుల్లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి కొన్ని తప్పులు చేసారు. ఇలాంటి వాటి వల్లే చాలా పెద్ద అవకాశాలు, హీరోయిన్ ఆఫర్లు పోయాయి అని తెలిపారు అర్జన.

పరిస్థితి వేరేలా ఉండేదేమో?

పరిస్థితి వేరేలా ఉండేదేమో?

‘మొదటి సినిమా ‘నేను'లో హీరోయిన్‌ పాత్ర చేసిన తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా'లో బలవంతంగా సపోర్టింగ్‌ రోల్‌ చేయవలసి వచ్చింది కళ్లజోడు పెట్టి డీ-గ్లామర్‌గా చూపించడంతో ఆ సినిమా సెట్లో రోజూ ఏడ్చేదాన్ని. కేవలం ఆ సినిమాలో చేయడం వల్లే ఓ పెద్ద డైరెక్టర్‌ సినిమాలో హీరోయిన్‌ పాత్రను పొగొట్టుకున్నా. ‘నువ్వొస్తానంటే..' చేయకపోయి ఉండుంటే ఈ రోజు పరిశ్రమలో నా స్థానం వేరేలా ఉండేదేమో.

రాజమౌళికి సారీ చెబుదామనుకున్నా

రాజమౌళికి సారీ చెబుదామనుకున్నా

అదే సమయంలో రాజమౌళి గారు తీసిన ‘మగధీర' సినిమాలో సలోని చేసిన పాత్ర ఆఫర్ చేసారు. అప్పుడు ఆ ఆఫర్ తిరస్కరించాను. రాజమౌళిగారు చాలా మంచి వ్యక్తి, ఒక ఆర్టిస్టులోని తపనను అర్థం చేసుకునే దర్శకుడు. ఆయన ఆఫర్ కాదన్నందుకు సారీ చెబుదామనుకున్నాను అని అర్చన చెప్పుకొచ్చారు.

English summary
Actress Archana Sensational comments on tollywood. Actress Archana gave an exclusive interview to a popular Youtube channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu