»   » సమంత, ఆది మూవీ ‘యూ టర్న్’లో ఎంటరైన భూమిక

సమంత, ఆది మూవీ ‘యూ టర్న్’లో ఎంటరైన భూమిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

"రంగస్థలం"లో రామలక్ష్మిగా సమంత, కుమార్ బాబు గా ఆది పినిశెట్టి విశేషమైన రీతిలో అశేష ప్రేక్షకలోకాన్ని మైమరపించిన తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం "యు టర్స్". కన్నడలో ఘన విజయం సాధించిన "యు టర్న్" చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ ​చిట్టూరి​​ నిర్మిస్తుండగా.. కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో భూమిక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. శుక్రవారం ఆమె షూటింగులో జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో భూమిక దెయ్యం పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Actress Bhumika Chawla joins the shoot of UTurn remake

ఒక ఫ్లై ఓవర్ మీద చనిపోతున్న మోటార్ సైకిల్ రైడర్ల కేసును సంబంధించి ఈ చిత్ర కథ తిరుగుతుంది. ఈ కేసును ఛేదించే జర్నలిస్టు పాత్రలో సమంత నటిస్తోంది. ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రం యూనిట్ చెబుతోంది.

ఆది పినిశెట్టి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ షూటింగ్ గత నెల మొదలైంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ముగిసింది. ఇప్పుడు సెకండ్ హైద్రాబాద్ లోని బూత్ బంగ్లాలో వేసిన భారీ సెట్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. నరేన్, భూమికల పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఒరిజినల్ వెర్షన్ కంటే అద్భుతంగా తెలుగు-తమిళ రీమేక్ ను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా తెలుగు-తమిళ నేటివిటీకి తగ్గట్లుగా చేసిన మార్పులు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయట. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాత: శ్రీనివాస్ చి​ట్టూరి​, కథ-దర్శకత్వం: పవన్ కుమార్.

English summary
Actress Bhumika Chawla joins the shoot of UTurn remake and the Shooting Progressing in Hyderabad. The Directed by Pawan Kumar, Bankrolled by Srinivas Chitturi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X