»   » ఈ దేశంలో ముద్దులు, బూతులు ఉండవా? సెన్సార్ బోర్డుపై హీరోయిన్ ఫైర్!

ఈ దేశంలో ముద్దులు, బూతులు ఉండవా? సెన్సార్ బోర్డుపై హీరోయిన్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నవాజుద్దీన్‌ సిద్దిఖి బాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రం 'బాబూమోషాయ్ బందూక్‌బాజ్‌'. ఈ చిత్రంలో బెంగాళీ నటి బదితా బాగ్ హీరోయిన్. ఇటీవల ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్లగా షాకింగ్ అనుభవం ఎదురైంది దర్శక నిర్మాతలకు. కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి ఏకంగా 48 కట్స్ సూచించింది.

సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, బిదితా బాగ్ మధ్య హాట్ సీన్లు, ముద్దు సన్నివేశాలు.... బూతు పదజాలంతో కూడిన డైలాగులు ఉన్నందునే సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ బిదితా బాగ్ ట్విట్టర్లో సంచలన కామెంట్స్ చేసింది.

భారతీయులు ముద్దులు పెట్టుకోరా; బూతులు మాట్లాడరా?

భారతీయులు ముద్దులు పెట్టుకోరా; బూతులు మాట్లాడరా?

సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహంగా ఉన్న బదితా బాగ్..... ‘‘భారతీయులు ముద్దులు పెట్టుకోరు, భారతీయులు బూతులు మాట్లాడరు... అందరూ చాలా సంస్కారులు'' అంటూ సెన్సార్ బోర్డుపై వ్యంగాస్త్రాలు సంధించింది.

ఆ సీన్లు తీయాల్సిందే అంటున్న సెన్సార్ బోర్డ్

కుషాన్‌ నందీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. సెన్సార్‌ బోర్డు సూచించిన విధంగా 48 చోట్ల కోతలు పెడితే తప్ప సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. నిబంధనల మేరకే ఈ కట్స్‌ చెప్పామని బోర్డ్‌ ఛైర్మన్‌ పహ్లాజ్‌ నిహలానీ తేల్చి చెప్పారు.

అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టే

అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టే

సినిమాకు ఇన్ని కట్స్ సూచించడంపై మీడియా వారు సెన్సార్ బోర్డ్ చీఫ్ నిహ్లానీని ప్రశ్నించగా.. ‘నా పని నేను చేస్తున్నా' అని చెప్పి వెళ్లిపోయారట. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పకనే చెప్పారు.

ఏమాత్రం బెదరని నిహ్లానీ

ఏమాత్రం బెదరని నిహ్లానీ

సెన్సార్ బోర్డ్ చీఫ్ పదవి నుండి నిహ్లానిని తొలగించాలని కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ నిహ్లానీ ఏమాత్రం బెదరడం లేదు. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నారు.

బాబూమోషాయ్ బందూక్‌బాజ్

బాబూమోషాయ్ బందూక్‌బాజ్

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్' మూవీకి కుషన్ నందీ దర్శకత్వం వహిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటిస్తుండగా అతడికి జోడీగా బెంగాలీ నటి బిదితా బాగ్‌ నటించింది. సినిమాలో తొలుత నవాజ్‌కి జోడీగా చిత్రాంగద సింగ్‌ను తీసుకున్నారు. కానీ ఇందులో అభ్యంతకర సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు.

సెక్స్ సీన్లు, హింస

సెక్స్ సీన్లు, హింస

ఇప్పటికే విడుదలైన ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్' ట్రైలర్ పరిశీలిస్తే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు బాగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. సెక్స్, హింస సీన్లను ప్రొజెక్ట్ చేస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు. ఆ ట్రైలర్ చూసినపుడే సెన్సార్ ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. ఇపుడు అనుకున్నట్లే జరిగింది.

సెన్సార్ బోర్డుపై విమర్శలు

సెన్సార్ బోర్డ్ తీరుపై పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు మోరల్ పోలిసింగ్ చేస్తోందని.... ముద్దు సీన్లు, లవ్ మేకింగ్ సీన్లకు కూడా కత్తెర పెట్టడం సబబు కాదని అంటున్నారు.

English summary
Actress Bidita Bag reacts on 48 cuts asked by the Censor Board on the movie Babumoshai Bandookbaaz. ‘Indians don't kiss. Indians never use cuss words. Sanskari’ Bidita Bag tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu