»   » మందు కొట్టిందా? హీరోయిన్‌ను చెక్ చేసిన పోలీసులు!

మందు కొట్టిందా? హీరోయిన్‌ను చెక్ చేసిన పోలీసులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం సేవించి వాహనం నడిపే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వారి కార్లు సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం లాంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం చిక్కారు.

ఇందులో భాగంగా ఈ వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా అటు వైపుగా కార్లో వచ్చింది టాలీవుడ్ హీరయిన్ దీక్షా పంథ్. పోలీసులు ఆమెను చెక్ చేసారు. అయితే అందులో ఆమె మద్యం సేవించలేదని తేలడంతో విడిచి పోయారు. బ్రీత్ ఎనలైజర్ తో టెస్టు నిర్వహిస్తున్న సమయంలో దీక్షా పంథ్ కాస్త కంగారు పడింది.

Actress Deeksha Panth's Drunk and Drive test

దీక్షా పంథ్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘ఒక లైలా కోసం' చిత్రంలో శీల పాత్రలో నటించింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్-వెంకీ కాంబినేషన్లో వచ్చిన ‘గోపాల గోపాల' చిత్రంలో కూడా అమ్మడు ఓ పాత్రలో నటించింది. ప్రస్తుతం కొన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తోంది.

English summary
The Hyderabad police has conducted drunk and drive test for two and half hours in Jubilee Hills. Model and actress Deeksha Panth is also tested during the drive and it is found that she did not take any alcohol.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu