»   »  బాహుబలి టీంకు క్షమాపణలు చెప్పిన నటి గౌతమి

బాహుబలి టీంకు క్షమాపణలు చెప్పిన నటి గౌతమి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి... ఈ సినిమా గురించి తెలియని భారతీయుడు, ఈ సినిమా చూడని సినీ ప్రేమికుడు ఉండరేమో. దేశంలో అత్యధిక మంది చూసిన సినిమా కూడా ఇదే అనే ఓ రికార్డు కూడా ఈ చిత్రంపై ఉంది. మరి అలాంటి సినిమాను.... అందులోనూ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయి ఉండి ఇంతవరకు చూడక పోతే ఎంత పాపం?... బహుషా నటి గౌతమి కూడా ఇలానే ఫీలయినట్లున్నారు.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో 'బాహుబలి' చిత్ర యూనిట్‍‌కు క్షమాపణలు చెప్పారు. ఆమె క్షమాపనలు చెప్పడానికి ప్రధాన కారణం ఇంత గొప్ప సినిమాను ఇంతవకు చూడక పోడమేనంట. తాను ఇప్పటి వరకు సినిమా చూడకపోవడానికి గల కారణం కూడా ఆమె వెల్లడించారు.


Actress Gautami apologizes to the Bahubali film team

బాహుబలి చూడాలి అని చాలా అనుకున్నాను, కానీ నా కుమార్తె పరీక్షలు జరుగుతుండటంతో సినిమాను చూడలేకపోయాను...అని ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినీ పరిశ్రమలో దశాబ్దాల నుంచి ఉన్న మార్కెట్ పరిధులను ఈ సినిమా చెరపేసిందని గౌతమి కొనియాడారు.


ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి మీద కూడా ఆమె ప్రశంసలు గుప్పించారు. ఒక ప్రాజెక్ట్‌ను సరైన రీతిలో హ్యాండిల్ చేయగలితే ఫలితం ఎలా ఉంటుందో రాజమౌళి చేసి చూపించారని తెలిపారు.


English summary
Actress Gautami apologizes to the Bahubali film team. She did not see the Baahubali movie till date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu