»   » అంతా బూతే అంటూ కవిత, మీడియాకు బాధ్యత లేదా అంటూ హేమ!

అంతా బూతే అంటూ కవిత, మీడియాకు బాధ్యత లేదా అంటూ హేమ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చలపతిరావు వల్గర్ కామెంట్లపై రోజుకో మీడియా సంస్థ చర్చా కార్యక్రమాల పేరుతో డిబేట్లు నిర్వహిస్తోంది. తెలుగు ఎంటర్టెన్మెంట్ ఇండస్ట్రీ ఎటు వైపు వెలుతోంది? తెలుగు సినిమాల్లో, తెలుగు టీవీ కార్యమాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న బూతు కంటెంటు వల్ల ఎలాంటి నష్టాలు జరుగబోతున్నాయంటూ చర్చోపచర్చలు జరుపుతున్నారు.

తాజాగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటి కవిత, హేమ తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. చలపతి రావు కామెంట్స్ ముమ్మాటికీ తప్పే, అలాంటి కామెంట్లను ఖండించాల్సిందే. అయితే తెలుగు సినిమాల్లో, కొన్ని టీవీ కార్యక్రమాల్లో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయ పడ్డారు.

బజర్దస్త్

బజర్దస్త్

జబ‌ర్దస్త్ కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని చూడటానికి వీలులేని విధంగా ఉంటున్నాయని సినీ న‌టి క‌విత అన్నారు.

ఇదేంటని అడిగితే...

ఇదేంటని అడిగితే...

ఓ ఆడియో ఫంక్షన్లో జబర్దస్త్ టీం కామెడీ పేరుతో బూతు స్కిట్లు చేసారు. వాటిని అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసారు. ఒకరిద్దరు మాత్రమే ఇబ్బంది పడ్డారు. ఇలాంటి బూతు ఫ్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నారని ఓ జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడిని అడిగితే చూసేవారు హ్యాపీగానే చూస్తున్నారు.. ప్రసారం చేసేవారు హ్యాపీగానే చేస్తున్నారు. ప్రోగ్రాం ఇష్ట‌లేక‌పోతే ఇంట్లో టీవీ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది క‌దా అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

ఆరోగ్యకరమైన కామెడీ తగ్గిపోయింది

ఆరోగ్యకరమైన కామెడీ తగ్గిపోయింది

ఒకరిని చూసి ఒకరు అన్నట్లుగా.... చాలా సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో బూతు కంటెంటు పెరిగిపోయింది. ఒకప్పటిలా ఆరోగ్యకరమైన కామెడీ ఈ కాలం సినిమాల్లో రోజు రోజుకు లోపిస్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేసారు.

మరి మీడియా ఏం చేసినట్లు?

మరి మీడియా ఏం చేసినట్లు?

చ‌ల‌ప‌తి రావు బాబాయి కామెంట్స్ తప్పే. కానీ మీడియా...... ఆ సమయంలో అక్కడే ఉన్న సినీన‌టులు ఆయన కామెంట్లను అక్కడే ఎందుకు తప్పుపట్టలేని అంటున్నారు. మ‌రి ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మీడియా ఎందుకు అప్పుడు ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌లేద‌ని హేమ అన్నారు. మీడియాకు రెస్పాన్సిబిలిటీ లేదా? అలా మాట్లాడితే ఆడియో ఫంక్ష‌న్ల‌కు రాబోమ‌ని మీడియా ఎప్పుడ‌యినా ప్ర‌క‌టించిందా? అని న‌టి హేమ వ్యాఖ్యానించారు.

మీడియా చేసేది తప్పు కాదా?

మీడియా చేసేది తప్పు కాదా?

మీడియాకు ఎప్పుడు మసాలానే కావాలి. సినీ న‌టీనటుల ఇబ్బందులు వారికి అక్కర్లేదు. ఓ న‌టి వ్య‌భిచారం చేసి పట్టుబడితే దాన్ని పదే పదే వేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తారని....అలా ప్ర‌సారం చేయ‌డం కూడా త‌ప్పు కాదా? అని హేమ ప్రశ్నించారు.

English summary
Actress Hema and Kavitha comments on Chalapathi Rao issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu