For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్లోరోఫామ్ ఇచ్చి.. అత్యాచారం చేసి.. టీవీ నటి హత్య??

  By Srikanya
  |

  Hemasri
  బెంగళూరు : అనంతపురంలోని స్నేహితుని ఫాంహౌస్‌కు తన భార్య హేమాశ్రీతో కలిసి వెళ్తుండగా ఆమె అస్వస్థతకు గురైందని వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించానని ఆమె భర్త సురేంద్ర బాబు పోలీసులకు మొదట సమాచారాన్ని అందించాడు. అయితే అనంతపురం ఫాంహౌస్‌కు వెళ్లేసరికే హేమాశ్రీ మృతి చెందిందన్న కొత్త అంశం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నటి హేమాశ్రీ ఇటీవల అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నగర పోలీసులు సురేంద్రబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  ఈ నేపధ్యంలో మరో కథనాన్ని తెలుగు దినపత్రిక ప్రచురించింది. పత్రిక కథనం ప్రకారం...హేమాశ్రీని లైంగికంగా లోబరుచుకోవాలని చూస్తోన్న సురేంద్రబాబుకు అనంతపురం నగరానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు తోడయ్యారు. వీరు కుల సంఘం సమావేశాల్లో మిత్రులు. ఆ మాజీ ప్రజాప్రతినిధులకు అనంతపురం జిల్లా రెడ్డిపల్లి సమీపంలో ఫామ్‌హౌస్ ఉంది. ఈ ఫామ్‌హౌస్‌కు సురేంద్రబాబు తరచుగా వచ్చి.. విందు వినోదాల్లో మునిగితేలేవారని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తనకు హైదరాబాద్‌లో పని ఉన్నట్లు హేమాశ్రీ భర్త సురేంద్రబాబుకు చెప్పారు. తానే స్వయంగా హైదరాబాద్‌కు తీసుకెళ్తానని చెప్పిన సురేంద్రబాబు.. ఆమెను తీసుకుని మంగళవారం సాయంత్రం నేరుగా రెడ్డిపల్లి సమీపంలోని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడు.

  అక్కడే ఆమెపై క్లోరోఫామ్ ప్రయోగించి.. అత్యాచారం చేసినట్లు సమాచారం. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు హేమాశ్రీని ఓ మంత్రి వద్దకు పంపి ఆయన కోరిక తీర్చాలని, తద్వారా ఓ కీలకమైన పని చేయించుకోవాలని పథకం పన్నినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న హేమాశ్రీని అమాత్యుని వద్దకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగానే.. క్లోరోఫామ్ ప్రభావం నుంచి తేరుకున్న హేమాశ్రీ ఎదురు తిరిగారని, వారు ఆమెపై తీవ్రస్థాయిలో దాడి చేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో ఆమె తల, ఛాతీకి బలమైన గాయాలవటంతో ఆమె స్పృహ తప్పటంతో మళ్లీ ఆమెకు మెలకువ రాకుండా క్లోరోఫామ్‌ను ప్రయోగించారని, మోతాదు అధికమవటంతో హేమాశ్రీ చనిపోయారని వివరిస్తున్నాయి. హేమాశ్రీ మృతదేహాన్ని బెంగళూరుకు తీసుకెళ్లాలని ఆ ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు సురేంద్రబాబుకు సూచించారని, దారిలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు మురళిని కూడా సురేంద్రబాబు తనతో తీసుకెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  ఇక హేమాశ్రీను ఫాంహౌస్‌కు తీసుకువెళ్లే సరికే ఆమె మృతి చెందిందని అక్కడి కాంగ్రెసు నాయకుడు, ఫాంహౌస్‌ యజమాని మురళి హెబ్బాళ పోలీసులకు తెలిపాడు. 'నా ఫోన్‌ అందుబాటులో లేనందున తన సహచరుడు కృష్ణకు సురేంద్రబాబు ఫోన్‌ చేశారు. ఫాంహౌస్‌లోకి వెళ్లే సమయానికి ఆమె చనిపోయినట్లు గుర్తించి అక్కడి కాపలాదారు సురేంద్రబాబు, అతని డ్రైవరు సతీష్‌ను వెనక్కు పంపించాడు. బలిజ సంఘం కార్యదర్శిగా మాత్రమే సురేంద్రబాబుతో నాకు పరిచయం. తొమ్మిది నెలల క్రితం తన ఫాంహౌస్‌లో ఇచ్చిన విందులో సురేంద్రబాబు, మరికొందరు స్నేహితులు కలుసుకున్నాం. హేమాశ్రీ కేసులో పోలీసులు నన్ను సంప్రదించారు. తనకు తెలిసిన అన్ని వివరాల్ని వారికి చెప్పాను. విచారణలో సాక్షిగా ఉండేందుకు సిద్ధమని తెలిపాను' అని చెప్పాడు.

  English summary
  TV serial actor Hemasri, 30, died under mysterious circumstances on Tuesday. Former Anantapur Corporation Head and Congress Leader Murali found to be the crucial link in solving the rape and murder of Kannada actress and popular TV anchor hem. The actor and her husband Surendra Babu, residents of Banashankari, were driving in a car to Anantapur in Andhra Pradesh when she allegedly developed complications.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X