twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హేమశ్రీ హత్య కేసులో భర్తనే నిందితుడు

    By Pratap
    |

    బెంగళూర్: నటి హేమశ్రీ హత్య కేసులో ఆమె భర్త సురేంద్రబాబునే పోలీసులు నిందితుడిగా చేర్చారు. హేమశ్రీ హత్య కేసులో బెంగళూర్‌లోని హెబ్బాళ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. హేమశ్రీ (34) హత్య కేసులో ఆమె భర్త సురేంద్ర బాబు (52)ను మొదటి నిందితుడిగా, కారు డ్రైవర్‌ సతీష్‌ను రెండో నిందితుడిగా చేర్చారు.

    నిరుడు అక్టోబర్ 9వ తేదీన హేమశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అపస్మారక స్థితిలో పడిపోయిన హేమశ్రీని ఆ రోజు భర్త సురేంద్ర బాబు ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

    సురేంద్ర బాబును పోలీసులు అక్టోబర్ 9వ తేదీన అరెస్టు చేశారు. ఆ తర్వాత సతీష్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్టోబర్ 8వ తేదీన హేమశ్రీతో కలిసి సురేంద్ర బాబు కారులో బెంగళూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. కారును నడపడానికి సతీష్‌ను వాడుకున్నాడు. అప్పటికే హేమశ్రీకి క్లోరోఫామ్ ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

    అనంతపురం వచ్చిన తర్వాత ఓ ఫామ్‌హౌస్ వద్ద కారును ఆపించి, హేమశ్రీని లోన గదిలోకి సతీష్ సాయంతో సురేంద్ర బాబు తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోవాలని సురేంద్ర బాబు సతీష్‌కు చెప్పాడు.

    ఈ కేసులో 70 మంది సాక్షులున్నారని, తాము సురేంద్రబాబుకు వ్యతిరేకంగా 276 పేజీల చార్జిషీట్ దాఖలు చేశామని పోలీసులు చెప్పారు. తమ వద్ద గట్టి సాక్ష్యాలున్నాయని కూడా పోలీసులు అంటున్నారు.

    English summary
    
 The Hebbal police have filed a 276-page chargesheet in connection with the murder of actress Hemashri, naming her husband Surendra Babu (52), a businessman and politician, and his driver Satish as accused.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X