twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహనటి ఒక్కరే కాదు.. అందరూ మహానటిలే.. కాకపోతే ఇండస్ట్రీలో కష్టం.. జయసుధ

    |

    ప్రముఖ నిర్మాత, రాజకీయ, పారిశ్రామికవేత్త టీ సుబ్బిరామిరెడ్డి (టీఎస్సాఆర్) కళా పరిషత్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లోని స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి జమున, సహజ నటి జయసుధ, ప్రముఖ నటుడు మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. తన జన్మదినోత్సవం (సెప్టెంబర్ 16) పురస్కరించుకొని గత 20 ఏళ్లుగా సినీ కళాకారులు, ఆధ్యాత్మిక వేత్తలను సత్కరించే కార్యక్రమాన్ని సంప్రదాయంగా టీఎస్సాఆర్) కళా పరిషత్ కొనసాగిస్తున్నది.

    ఈ సందర్భంగా 16వ తేదీన కన్యకుమారి నుంచి కశ్మీర్ వరకు ఉన్న ప్రముఖ దేవాలయాలకు చెందిన పూజారులను సత్కరిస్తున్నాం. అలాగే సుమారు 50 ఏళ్లుగా సినీ పరిశ్రమతో మమేకమై.. దాదాపు 300పైగా చిత్రాల్లో గొప్ప పాత్రలను పోషించిన జయసుధను అభినయ మయూరి అవార్డుతో సత్కరిస్తాం అని అన్నారు.

    తెలుగుదనం ఉట్టిపడేలా

    తెలుగుదనం ఉట్టిపడేలా

    తెలుగుదనం ఉట్టిపడేలా నటనను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకొన్నారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే లీనమైపోయి ఎంతో మంది దర్శకులను మెప్పించింది. పండంటి కాపురంలో జమున కూతురు పాత్రను పోషించారు. బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించి సీనియర్ నటిగా ప్రేక్షకులు, సినీ వర్గాల ప్రశంసలు అందుకొంటున్నారు. ఆమె గురించి అలాంటి నటిని సత్కరించుకోవడం గర్వంగా ఉంది అని సుబ్బిరామిరెడ్డి అన్నారు.

    జయసుధకు అవార్డు రావడం

    జయసుధకు అవార్డు రావడం

    మురళీమోహన్ మాట్లాడుతూ.. తన పుట్టిన రోజున కళాకారులను సన్మానిస్తూ, అందరితో కలిసి మెలిసి ఉండే మంచి మనిషి నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. జయసుధతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తొలి సినిమా తిరుపతి చిత్రంలో నాతో చేసింది. జ్యోతి సినిమా ఆమెకు, నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో నటనలో చూపిన పరిణతి అద్భుతం. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాం. ఆమెలో గొప్పతనం ఏమంటే.. ఎలాంటి పాత్ర అయినా అందులో లీనమైపోతుంది. అలాంటి నటికి సుబ్బిరామిరెడ్డి అభినయ మయూరి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు పట్టించు రాబోయే రోజుల్లో ఇలాగే కళాకారులను సన్మానించాలి. ఆయన సన్మానించే కళాకారుల విషయంలో తనను కూడా దృష్టిలో పెట్టుకొని అవార్డుతో సన్మానిస్తారని ఆశిస్తున్నాను.

    జయసుధ నా కూతురులాంటిది

    జయసుధ నా కూతురులాంటిది

    ప్రముఖ నటి జమున మాట్లాడుతూ.. సుబ్బిరామిరెడ్డి తన జన్మదినం రోజున కళాకారులను సన్మానించడం చాలా సంతోషం. నాకు అవార్డు ఇవ్వడం ద్వారా ఈ అవార్డులను ప్రారంభించారని చెప్పడానికి గర్వంగా ఉంది. పండంటి కాపురంలో నా కూతురిగా జయసుధ నటించింది. అప్పటి నుంచి ఆమెతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు. ఆమె నటించిన శివరంజని సినిమా నాకు చాలా ఇష్టం. ఇలాంటి అవార్డులను ప్రతీ ఏడాది ఇవ్వడం గొప్ప విషయం. కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రాజకీయరంగంతోపాటు పలు రంగాల్లో విశేష సేవలందిస్తున్నారు అని అన్నారు.

    అందరూ మహానటిలే

    అందరూ మహానటిలే

    జయసుధ మాట్లాడుతూ.. సాధారణంగా అవార్డులు అందుకొనే వ్యక్తులు ప్రెస్ మీట్ రారు. కానీ ఈ అవార్డులు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నందున మీడియాను కలుసుకోవడానికి నేను వచ్చాను. సుబ్బిరామిరెడ్డి నిర్వహించే అవార్డుల కార్యక్రమానికి ప్రతీ ఏటా హాజరవుతున్నాను. ఆయనలో ఉండే గొప్ప విషయం ఏమిటంటే.. సీనియర్ నటులను గుర్తుపెట్టుకొని సన్మానించడం గొప్ప విషయం. మహానటి అంటే మనం ఒక్కరే అనుకుంటాం. అందరూ మహానటిలే. మహనటి అయితే తప్ప ఇండస్ట్రీలో సస్టైన్ అవలేం. జమున గారి నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నా. ఆమెకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. వాటిని సాక్రిఫైస్ చెయ్యకుండా సక్సెసయ్యారు.

    ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి

    ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి

    మురళీమోహన్ గారు ఎవర్‌గ్రీన్ హీరో. ఆయన (జుట్టుకి) కలర్ వేసుకున్నా, వేసుకోకపోయినా యువకుడిలాగే కనిపిస్తారు. మా ఇంట్లో జీన్స్ ప్రకారం నా జుట్టు ఊడిపోతోంది. అవార్డులు రాకపోయినా ఫర్వాలేదని అంటుంటాం కానీ, అవార్డులు వస్తే మనసులో సంతోషంగా అనిపిస్తుంది. అవార్డు అనేది మనం చేసిన పనికి గుర్తింపు. కొన్ని అవార్డులు ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉదాహరణకు నంది అవార్డులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టేశాయి. ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం మరిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కళాకారులను అవార్డులతో సత్కరించాలని కోరుతున్నాను.

    English summary
    T Subbarami Reddy said that the honors will be done on his birthday which happens to be on September 17th. On the occasion of my birthday TSR Lalithakala Parishath is organizing grand spiritual and cultural events on 16th and 17th September, 2019 at Visakhapatnam. On 16th September I am felicitating Spiritual Personalities and Chief Priests of Indian Temples from Kashmir to Kanyakumari & Kashi (Varanasi) to Rameshwaram at VUDA Children Theatre, Siripuram, Visakhapatnam. On 17th September “Sarvadharma Samabhavana Sammelan” and spiritual leaders of Hindu, Islam, Christian, and Sikh religions will be honoured at Kalavani Auditorium, Visakhapatnam at 5.00 pm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X