»   » ఆ టైపు కాదు, అందుకే ఇరికించారు: నటి కళ్యాణి

ఆ టైపు కాదు, అందుకే ఇరికించారు: నటి కళ్యాణి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ నటి కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి వనస్థలిపురంలో కొంత మంది పురుషులతో కలిసి పేకాట ఆడుతూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆమె కేవలం పేకాట ఆడటానికే అక్కడికి వెళ్లిందా? లేక మరేదైనా అసాంఘీక కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నాయా? అనే అను మానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చి స్పందించారు. తనను ఎవరో కావాలనే పేకాట కేసులో ఇరికించారని కళ్యాణి ఆరోపించారు. హరికథ కళాపీఠం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తన కార్యాకలాపాలను ఆపాలని కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు. పేకాట ఆడుతున్న పెద్ద మనుషులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు.

Actress Kalyani arrested in Gambling

తనకు పేకాట ఆడే అలవాటు ఉందని, అందులో తప్పుంటే కోర్టు తనకు శిక్ష వేస్తుందని అన్నారు. అంతేకానీ దాన్ని ఆధారంగా చేసుకుని మీడియాలో ఇతరత్రా అనుమానాలు వచ్చేలా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Actress Kalyani arrested in Gambling. Kalyani appeared in more than 100 Telugu movies.
Please Wait while comments are loading...