»   » క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి కనక

క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి కనక

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : నిన్నటితరం తమిళ నటి కనక క్యాన్సర్‌తో కేరళలో ఈరోజు (జులై, 30) మరణించినట్లు తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఐతే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆమె జీవించే ఉందని స్పష్టమైన సమాచారం అందింది. ఆమె గత కొంత కాలంగా ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసంవత్సరం జనవరి నుంచి ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు.

  ప్రముఖ తమిళ నటి దేవిక కుమార్తె అయిన కనక 16 ఏళ్ల వయసులోనే సినిమారంగంలోకి ప్రవేశించింది. 1989లో వచ్చిన 'కరకట్టకరన్' అనే చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన కనక తమిళం, మళయాలంలో దాదాపు 40 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

  కనక హీరోయిన్‌గా నటించిన చివరి సినిమా తమిళంలో 1999లో విడుదలైన 'సింహ రాశి'. ఆమె కెరీర్లో రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, విజయ్ కాంత్, ప్రభు, శరత్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. కనక తల్లి దేవిక మరణం తర్వాత ఆమె సినీ రంగానికి పూర్తిగా దూరమైంది. ఆమె చివరి సారిగా 2004లో వచ్చి 'కుసురుతీ' చిత్రంలో కనిపించింది.

  కనక తెరంగ్రేటం

  కనక తెరంగ్రేటం

  తమిళంలో వచ్చిన ‘కరకట్టకరన్' చిత్రం ద్వారా కనక తెరంగ్రేటం చేసింది. గంగై అమరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామరాజన్, కనగ, సెంథిల్, కోవై సరళ, వేగై, చంద్రశేఖర్, గౌండమని ముఖ్య పాత్రల్లో నటించారు.

  కనక-రజనీకాంత్

  కనక-రజనీకాంత్

  1990లో వచ్చిన తమిళ చిత్రం ‘అథిసయ పిరవి' చిత్రంలో కనక రజనీకాంత్ సరసన నటించింది. ఎస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో రజనీకాంత్, కనక, నగేష్, జైగణేష్, బేత సుధాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు.

  కనక జీవితం...

  కనక జీవితం...

  కనక వైవాహిక జీవితం ఇప్పటికీ మిస్టరీనే. కాలిఫోర్నియాలో సెటిలైన మెకానికల్ ఇంజనీర్ ముత్తుకుమార్‌ను పెళ్లాడింది. అయితే 2010లో ఆమె మీడియాతో మాట్లాడుతూ పెళ్లయిన 15 రోజులకే తన భర్త మిస్సయ్యాడంటూ ఆమె సంచలన ప్రకటన చేసింది.

  తమిళ చిత్రాల్లో కనక...

  తమిళ చిత్రాల్లో కనక...

  తమిళ చిత్రాలైన ఎథిర్ కత్రు, మక్కల్ కురల్, అథిసయ పిరవి, వెల్లయా దెవన్, పురుషన్ ఎన్నక్కు అరసన్, దుర్గా, అమ్మన్ కోవిల్ థిరువిఝా, సాత్తన్, సల్లయ్ తట్టాతె, కుంబాకారై తంగయ్య, తలట్టు కెక్కుతమ్మా లాంటి చిత్రాల్లో కనక నటించింది.

  మళయాలం చిత్రాల్లో కనక...

  మళయాలం చిత్రాల్లో కనక...

  1991లో వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రంతో మళయాల చిత్రసీమలోకి అడుగు పెట్టిన కనక ముఖేష్ సరసన నటించింది. అదే విధంగా వసుధ, ఎఝరా పొన్నన, వియత్నాం కాలనీ, గోల్హనతరా వార్తా, నరసింహం లాంటి చిత్రాల్లో నటించారు.

  English summary
  Tamil yesteryear actress Kanaka passed away in Kerala, today, (July 30). She was suffering from cancer, from past seven months. The actress was under palliative care in Alappuzha, Kerala, where she last breathed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more