»   » అందుకే డ్రగ్స్ ఆరోపణలు వచ్చిఉంటాయ్: పూరీ పై హీరోయిన్ పంచ్

అందుకే డ్రగ్స్ ఆరోపణలు వచ్చిఉంటాయ్: పూరీ పై హీరోయిన్ పంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ర‌జ‌నీ త‌ప్ప మీకు మిగ‌తా విష‌యాలు ప‌ట్ట‌వా? ఆయ‌న రాజ‌కీయాగమ‌నం గురించి మాత్ర‌మే ఎందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు? త‌మిళ ప్ర‌జ‌లు, రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లేవీ క‌నిపించడం లేదా?" అంటూ తమిళ, జాతీయ‌ మీడియాలపై సెటైర్ వేసి రజినీ అభిమానులనుంచి పెద్ద వ్యతిరేకతనే ఎదుర్కొన్న నటి కస్తూరి ఈసారి టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని టార్గెట్ చేసుకొని మరీ పంచ్ లు విసిరింది...

నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టడం గురించి 'పైసా వసూల్' ఆడియో వేడుకలో పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. అది బాలయ్యకు, అభిమానులకు మధ్య లవ్ స్టోరీ అని.. దాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని కవర్ చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. పూరి మీద ఘాటైన సెటైర్లు వేసింది.

Actress Kasturi Satires On Puri Jagannath

అభిమానుల్ని బాలయ్య కొట్టడంలో తప్పు లేదన్నట్లు పూరి మాట్లాడుతున్నాడని.. దీన్ని బట్టి చూస్తే పూరి మీద డ్రగ్స్ ఆరోపణలు ఏ ఆధారాలు లేకుండా రాలేదని తెలుస్తోందన్నట్లుగా కస్తూరి వ్యాఖ్యానించడం విశేషం. బాలయ్య విషయంలో పూరి చేసిన సమర్థన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి వాస్తవమే.

ఐతే ఈ వ్యవహారంలో మన సెలబ్రెటీలెవ్వరూ కూడా పెదవి విప్పలేదు. అందరూ సైలెంటుగా ఉన్నారు. ఐతే తెలుగు సినిమాతో ఎప్పుడో కనెక్షన్ కట్ అయిపోయిన కస్తూరి.. అనూహ్యంగా దీనిపై స్పందించడం.. పూరి మీద ఇలా కౌంటర్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

English summary
Actress Kasturi tweeted that “#NandamuriBalakrishna’s fans love to be hit- #PuriJagan says. uhhh…Maybe that drug charge wasn’t without basis after all.” .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu