»   » వివాదాస్పద నటి ఖుష్భూ కాలికి గాయం

వివాదాస్పద నటి ఖుష్భూ కాలికి గాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దక్షిణాది వివాదాస్పద నటి ఖుష్బూ కాలికి గాయం అయింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బ్యాండేజీతో ఉన్న తన కాలు ఫోటోను ఆమె పోస్టు చేసారు. నా కాలికి గాయమైనా ఏమీ ఫర్వాలేదు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ ఆర్.జి.కె నన్ను చాలా బాగా ట్రీట్మెంటు ఇస్తున్నారు. త్వరలోనే కోలుకుంటాను అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు.

తన వ్యవహార శైలితో సంచలనాలు సృష్టిస్తూ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉండే ఖుష్బూ ఈ సారి తన కాలి గాయంతో వార్తల్లోకెక్కారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'ధర్మత్తిన్‌ తలైవన్‌' చిత్రంతో కోలీవుడ్‌ను చూసిన కుష్బూ.. ఒక్క చిత్రంతోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఎక్కడో ముంబయిలో పుట్టి పెరిగినా.. తమిళుల హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి కుష్బూ. అభిమానులతో ఆలయాన్ని కట్టించుకున్నఆమె ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు, రాజకీయాలతో బిజీగా గడుపుతోంది.

Actress Khushboo Injured

తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కుష్బూ అందచందాలు, అభినయం ఉండటంతో.. తక్కువ సమయంలోనే ఫాలోయింగ్‌ పెరిగింది. ఆ తర్వాత కమల్‌, సత్యరాజ్‌, ప్రభు వంటి అగ్ర హీరోలతోనూ అమ్మడు ఆడిపాడింది. 'చిన్నతంబి' చిత్రంలో ఊహించని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది కుష్బూ. ఇందులో ప్రభు, కుష్బూ జోడీ అందరకీ నచ్చడంతో.. ఈ జంట మరిన్ని చిత్రాల్లో కనువిందు చేసింది. కథానాయిక పాత్రలు తగ్గాక.. ఇతర పాత్రల్లో కూడా నటించింది. కన్నడ, మలయాళం, తెలుగులోనూ వందలాది చిత్రాల్లో నటించింది.

English summary
"My leg looks like this.. but I m in very good hands of Dr.RGK at Apollo. . Will be heading out now in fact." khushbu tweeted.
Please Wait while comments are loading...