»   » ఇంకో హీరోయిన్ పేరుమార్చుకుంది అదృష్టం కోసమేనా..?

ఇంకో హీరోయిన్ పేరుమార్చుకుంది అదృష్టం కోసమేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆ ఒక్కడు'తో తెలుగు తెరకు పరిచయమైన మధురిమ గుర్తుందా..? సరదాగా కాసేపు, ఆరెంజ్, షాడో, వేట, కొత్త జంట, గ్రీన్ సిగ్నల్, టెంపర్, దోచెయ్ తదితర సినిమాల్లో నటించింది. ఆ సినిమాల వల్ల పాపం ఈ పిల్లకి ఒరిగిందేమీ లేదు.. కొత్త జంటలో ఈ భామ చేసిన 'అటు అమలాపురం ఇటు పెద్దాపురం' ఐటెం సాంగ్ అయితే కుర్రకారుతో కేకలు పెట్టించింది. కానీ టాలీవుడ్ లో ఈ భామకు బ్రేక్ మాత్రం రాలేదు.

ఆ తర్వాత కన్నడ ,మలయాళ చిత్రాల్లో కూడా చాలానే ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రాలేదు.హీరోయిన్ గాను ఐటెం భామగాను చాలానే తెలుగు సినిమాలు చేసింది మధురిమ .అయినా పాపం కాలం కలిసిరాలేదు...ఆ తర్వాత ఆఫర్లు కూడారాలేదు వరుసగా ఇన్ని సినిమాల తర్వాత కూడా తన కెరీర్ గాడిలో పడక పోవటం తో కొత్త భయం మొదలైనట్టుంది. ఈ పేరు కలిసిరావటం లేదంటూ పేరు మార్చుకుంది. ఇక నుంచి తన పేరు " నైరా బెనర్జీ" అట.

కానీ అవకాశాలు తగ్గడం వల్లే పేరు మార్చుకుందన్న మాటలని మాత్రం ఒప్పుకోకుండా బింకంగా ఉంటోది.నిజానికి తనకు అలాంటి నమ్మకాలు లేవంటూనే. "ఏమో ఈ రకంగా అయినా ఏమైనా మార్పొస్తుందేమో చూద్దాం" అంటూ ఆశా భావం వెలిబుచ్చింది.

Actress Madhurima Changed Her Name

'నైరా" అనేది నా ముద్దు పేరు. మధురిమ నా అఫీషియల్ నేమ్. తెరపై కూడా ఇదే పేరుతో నటించా. అయితే మధురిమ పేరుతో మరో నటి(తులి) ఉండడంతో గందరగోళం ఏర్పడింది. ఒకసారి నా ఇంటర్వ్యూను ఆమె ఫొటోలతో ప్రచురించారు. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్స్ ఉండడంతో సమస్య తలెత్తుతోంది.

అందుకే తెర పేరును మార్చుకోవాల్సి వచ్చింది. నా పాత పేరు మధురిమతో ఇక ఎటువంటి సంబంధం ఉండకూదని అనుకుంటున్నా. అందరూ నన్ను "నైరా" అని పిలవడం అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను' అని మధురిమ వివరించింది.

తెలుగులో తనకు సరైన విజయాలు దక్కలేదు కాబట్టే గుర్తింపులేని చోటుని వదిలి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నానని చెప్పింది. బాలీవుడ్ లో సన్నీ లియోన్ తో కలిసి చేసిన "ఒన్ నైట్ స్టాండ్" సినిమా మే 6న విడుదలైంది. కానీ పేరు భలం ఇంకా బలపడలేదేమో ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉంది...

English summary
Madhurima changed her name as Nyra Banerjee.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu