లైంగిక వేధింపు కేసు పెట్టిన నటి
ముంబై: నటి మోనా వసు.. రీసెంట్ గా ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ముంబై వెర్శోవా లోని మదీ ఐలాండ్ లోని తన ఇంటికి రాత్రి 11.45 కు వస్తూండగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెకు బాగా దగ్గరగా వచ్చి ఆమెను టచ్ చేసి ఏమీ ఎవరగనట్లు వెళ్లిపోబోయాడు. అయితే అది గమనించిన మోనా అతన్ని వదలలేదు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అతన్ని వెంబడించి పట్టుకుని కొట్టి డిఎన్ నగర్ పోలీసులకు అప్పచెప్పింది. అంతేకాదు అతని మీద వేధింపుల కేసు పెట్టింది. ఇదంతా రెండు గంటల సేపు పట్టింది. తర్వాత పోలీసులు ఆమెను ఇంటివద్ద దింపారు.
మోనా మాట్లాడుతూ..రాత్రి లేట్ అవర్స్ తో ఒంటిరిగా ప్రయాణం చేయటం ప్రమాదమేనని తనకు తెలుసునని, అందుకే తాను ఎప్పుడు పెప్పర్ స్ప్రే, కంపాస్ దగ్గర ఉంచుకుంటానని అన్నారు. రాత్రిళ్లే కాదు పగలు కూడా ఈ దేశంలో ఇలాంటి చేదు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె ఆవేదనతో అన్నారు.


Click it and Unblock the Notifications











