»   »  వర్షం: మోడీ పాలనపై నేహా ధుపియా విమర్శ, నెటిజన్ల ఆగ్రహం

వర్షం: మోడీ పాలనపై నేహా ధుపియా విమర్శ, నెటిజన్ల ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన విమర్శలు చేసి బాలీవుడ్ బామ నేహా ధుపియా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర రాజధానిలో కురిసిన కుండపోత వర్షం వల్ల జనం అతలాకుతలం అయింది.

రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చాలా కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను కూడా వర్షం కారణంగా అసౌకర్యానికి గురయ్యానని నేహా ధుపియా ట్వీట్ చేసింది.

neha dhupia

అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన ఆమె ట్వీట్ చేసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో ముంబై తడిసిముద్దయిందని, గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు, యోగా కాదని, ప్రజలకు భద్రత పైన భరోసా ఇవ్వాలని ట్వీట్ చేసింది.

దీనిపై ఆమెకు అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందన వచ్చింది. ఎక్కువగా ఆమెకు వ్యతిరేకంగా స్పందించారు. ఆమె పబ్లిసిటీ కోసం ఇలా చేసిందని కొందరు విమర్శించారు. చేసే పనిలేక ఆమె సోషల్ మీడియాలో ఇలా విమర్శలు గుప్పిస్తోందని ఇంకొందరు అన్నారు.

English summary
Neha Dhupia is the latest in line to come under fire for speaking or rather tweeting out against PM Narendra Modi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu