»   » అందులో తప్పేముంది..? నాకు నచ్చిన వాడితో సహజీవనం చేస్తా... బోల్డ్ గా చెప్పేసింది మరి

అందులో తప్పేముంది..? నాకు నచ్చిన వాడితో సహజీవనం చేస్తా... బోల్డ్ గా చెప్పేసింది మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నికిషా పటేల్.. ఈ పేరు పవన్ కళ్యాణ్ నటించిన 'పులి' సినిమా చూసిన వారందరికి సుపరిచితమే. పులి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో కోలీవుడ్‌కు యూటర్న్ తీసుకుంది. అయితే తమిళ ప్రేక్షకుల్లో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. తమిళంలో చేసింది ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే. 'తలైవన్' తో తమిళ ప్రేక్షకులకు పరిచయమై 'ఎన్నమో ఏదో', 'కరైఓరం', 'నారదన్' చిత్రాలతో ఒకింత సక్సెస్‌‌‌ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఎలాగైనా టాలీవుడ్‌లోనే మంచి సక్సెస్‌‌లతో నిలదొక్కుకోవాలని కంకణం కట్టుకున్న ఈ భామ చాలా గ్యాప్ తర్వాత 'అరకు రోడ్‌' సినిమా‌లో అందాలు ఆరబోసింది.. అయినా పెద్దగా హిట్ కాలేదు. చాలా అవకాశాలు వచ్చినా తాను నటించలేదని, చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు నటిస్తున్నట్లు పేర్కొంది. భార్య భర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదని, పెళ్లితో ప్రతొక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదని పేర్కొంది. తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని చెప్తోంది 'నికీషా'

Actress nikesha patel to go for live in relationship

"భార్యాభర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదన్నదే నా అభిప్రాయం. పెళ్లితో వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదు. 2030 సంవత్సరానికల్లా మన దేశంలో పెళ్లి అనే బంధం స్థానంలో సహజీవనశైలి పెరుగుతుందని నమ్ముతున్నా. నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తా" అంటూ చెప్పేసింది.

మొన్నా మధ్య తనకు ఇష్టం లేకుండానే పవన్ తో నటించా అని చెప్పి చిన్న దుమారమే రేపింది ఈ అమ్మడు. పవన్‌ సినిమాలో హీరోయిన్‌ అంటే ఆ తర్వాత వరుసబెట్టి సినిమా అవకాశాలు వచ్చేస్తాయని ఆశపెట్టుకుందట. కానీ, ఆ సినిమా పరాజయం పాలవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు.

నిజానికి ఆమె 'కొమరం పులి'లో నటించడానికి మొదట ఇష్టపడలేదట. దర్శకుడు ఎస్‌జే సూర్య ఒత్తిడి చేయడం వల్లే ఒప్పుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలియజేసింది. 'ఓ బాలీవుడ్‌ సినిమాతో ఎంట్రీ ఇద్దామనుకున్నా. నాకు ప్రాంతీయ సినిమాల్లో నటించడం ఇష్టమే లేదు. కానీ దర్శకుడు ఎస్‌జే సూర్య నన్ను బలవంతపెట్టి 'కొమరం పులి'లో నటింపజేశాడు. అది పరాజయం పాలవడంతో ఆ తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అలా చాలా ఏళ్లు ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడిప్పుడు కొద్దిగా అవకాశాలు వస్తున్నాయ'ని నికిషా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

English summary
Actress Nikesha Patel has said that she didn’t believe in the institution of marriage and has asserted that it was more likely that she would prefer a ‘live-in’ relationship to getting married.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu