»   » సముద్రంలో 120 అడుగుల లోతున.. బాలీవుడ్ తార.. వారెవా క్యాబాత్ హై!

సముద్రంలో 120 అడుగుల లోతున.. బాలీవుడ్ తార.. వారెవా క్యాబాత్ హై!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్‌లోకి ప్రవేశించించింది పరిణితి చోప్రా. లేడీస్ అండ్ రికీ బెహల్, ఇష్క్ జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్ లాంటి ఘన విజయాలతో సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకొన్నది. ప్రస్తుతం గోల్‌మాల్ అగెయిన్ చిత్రం కోసం సిద్ధమవుతున్నది. త్వరలోనే ఆమె స్కూబా డైవర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నది.

స్కూబా డైవింగ్‌పై పరిణితికి అమితాసక్తి

స్కూబా డైవింగ్‌పై పరిణితికి అమితాసక్తి

అత్యంత సాహస క్రీడ అయిన స్కూబా డైవింగ్‌పై పరిణితి చోప్రాకు అమితమైన ఆసక్తి ఉంది. ఇటీవల ఆమె అధికారికంగా ఈ క్రీడలో పాల్గొనేందుకు సర్టిఫికెట్ సాధించింది. దీంతో ఆమె సముద్రంలో దాదాపు 120 అడుగుల లోతున విహరించే అవకాశం ఏర్పడింది.

 సముద్ర గర్భ అన్వేషణ గొప్ప అనుభూతి

సముద్ర గర్భ అన్వేషణ గొప్ప అనుభూతి

‘డైవింగ్ చేయడమంటే నాకు అదోక గొప్ప అనుభూతి. సముద్ర గర్భంలో తేలికగా మారిన శరీరంతో అందమైన చేపలను, ప్రమాదకరమైన షార్క్, రంగురంగుల మొక్కలను చూడటమంటే మహా సరదా. సముద్రం అడుగున రాత్రి పూట విహరించాలని ఉంది'. రాత్రి పూట స్కూబా డైవింగ్ చేయడం కోసం అడ్వాన్స్‌డ్ కోర్సు చేసేందుకు పరిణితి చోప్రా సిద్ధమవుతున్నారట.

ప్రమాదకర క్రీడ కాదు.. ఆటవిడుపు

ప్రమాదకర క్రీడ కాదు.. ఆటవిడుపు

ప్రతీ ఏడాది షూటింగ్ కోసమో లేదా విడిది కోసమో చాలా దేశాలు తిరుగుతుంటాను. దాదాపు ఐదారు దేశాలకు వెళ్తుంటాను. ఓడలపై చాలా మందిని కలుసుకొంటాను. వారితో కలిసి సముద్ర గర్భంలో అన్వేషణకు వెళ్తుంటాను. నా దృష్టిలో డైవింగ్ ప్రమాదకరమైన క్రీడ కాదు. ఆటవిడుపు మాత్రమే అని పరిణితి వెల్లడించింది.

నడుము 38 నుంచి 30 వరకు

నడుము 38 నుంచి 30 వరకు

పరిణితి చోప్రా కొద్ది నెలల క్రితం విపరీతంగా బరువు పెరిగింది. ఓ దశలో 86 కిలోలకు పెరిగిపోవడంతో లావుగా కనిపించడంతో బాలీవుడ్ అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఇక కదురదనుకున్న ఆమె కఠినంగా శ్రమించి సన్నగా మారిపోయింది. పరిణితి లావు తగ్గడంపై బాలీవుడ్ ముద్దుగుమ్మలు నోరెళ్ల బెట్టారు. ఓ దశలో 38 నడుము కొలత ఉండే ఆమె 30 నంబర్‌కు వచ్చింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోయింది.

2011లో బాలీవుడ్‌లోకి అడుగు

2011లో బాలీవుడ్‌లోకి అడుగు

2011లో రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మతో కలిసి లేడీస్ వర్సెస్ రికీ బెహల్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఇష్క్ జాదే. శుద్ధ దేశీ రొమాన్స్, హసీతో ఫసీ, దావత్ ఏ ఇష్క్, కిల్ దిల్, డిష్యూం చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మేరీ ప్యారీ బిందు, గోల్‌మాల్ అగెయిన్ చిత్రాలకు అంగీకారం తెలిపింది.

English summary
Actress Parineeti Chopra has become a certified scuba diver. The actress is now eligible to dive up to 40 meters or 120 feet in an open sea.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu