»   » ఆ వ్యక్తి వల్లే తల్లిని అయ్యా.. ఆ సమయంలో ఏడ్చాను.. నటి ప్రగతి

ఆ వ్యక్తి వల్లే తల్లిని అయ్యా.. ఆ సమయంలో ఏడ్చాను.. నటి ప్రగతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ ఏజ్‌లోనే దాదాపు తన వయసుకు సమానంగా ఉండే యువ హీరోలోకు తల్లిగా నటించి మెప్పించి నటి ప్రగతి. ప్రస్తుతం టాలీవుడ్‌లో తల్లి పాత్రలకు చిరునామాగా మారింది. ఏడాదికి దాదాపు 25 చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటిస్తూ ఆ పాత్రలకు గ్లామర్ తెస్తున్నది. యంగ్ మదర్ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది ప్రగతి. ఇటీవల ఆమె idreammedia.comకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితానికి సంబంధించిన పలు విషయాలను యూట్యూట్ ప్రేక్షకులతో పంచుకొన్నారు.

యంగ్ ఏజ్‌లో తల్లి పాత్ర అంటే కంగారు పడ్డా

యంగ్ ఏజ్‌లో తల్లి పాత్ర అంటే కంగారు పడ్డా

టెలివిజన్ రంగంలో అక్కాచెల్లెలు సీరియల్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాను. నాకు తల్లిగా శ్రీవిద్య నటిస్తున్నది. ఆ సమయంలో సురేష్ ప్రోడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ చిత్రంలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్‌కు తల్లిగా నటించాలని వారు చెప్పారు. తల్లి పాత్ర అనగానే నా మతిపోయింది. ఈ వయసులో అమ్మ పాత్ర ఏమిటీ అని కంగారు పడ్డాను.

శ్రీవిద్య లేకపోతే నా కెరీర్ ఇలా ఉండేది కాదు..

శ్రీవిద్య లేకపోతే నా కెరీర్ ఇలా ఉండేది కాదు..

అదే సయయంలో అక్కడికి శ్రీవిద్య వస్తే తల్లి పాత్ర ఆఫర్ గురించి చెప్పాను. నాకు తల్లి పాత్ర చేయడం ఇష్టం లేదని ఆమెకు చెప్పాను. దాంతో ట్రై చేస్తే వద్దు. ఒకవేళ క్యారెక్టర్ నటిగా కొనసాగాలంటే చేయల్సాందే అని శ్రీవిద్య చెప్పి.. బలవంతంగా ఆ క్యారెక్టర్ చేసేలా నన్న ప్రభావితం చేసింది. ఆమె ఒప్పించకపోతే తాను టెలివిజన్ సీరియల్‌లో నటిస్తూ రిటైర్ అయిపోయేదాన్ని అని ప్రగతి చెప్పింది.

యువ హీరో, హీరోయిన్లలందరికీ అమ్మగా.

యువ హీరో, హీరోయిన్లలందరికీ అమ్మగా.

అల్లు అర్జున్, రాంచరణ్, లావణ్య త్రిపాఠి, కాజల్ లాంటి యువ హీరో, హీరోయన్ల తొలి చిత్రాలలో తల్లి పాత్రను పోషించాను. కొన్నిసార్లు యువ హీరోలకు తల్లిగా నటిస్తుంటే వారే బాధపడుతుంటారు. యువ హీరోలకు అమ్మగా నటించిన చిత్రాలు భారీ హిట్లను సాధించాయి. దాంతో తనను లక్కీ అమ్మ అని భావించేవారని ప్రగతి తెలిపారు.

నేను తల్లి అంటే అనుష్క బాధపడింది

నేను తల్లి అంటే అనుష్క బాధపడింది

డమరుకం చిత్రంలో అనుష్కకు తల్లిగా నటించాల్సి వచ్చినపుడు ఆమె చాలా బాధపడిందని ఆమె చెప్పారు. అయ్యో పాపం.. ఆమె చాలా యంగ్, ఆమె నాకు తల్లి నటించడం ఏమిటీ అని అనుష్క అన్నారని ప్రగతి తెలిపింది. అనుష్క, రెజీనా, ఇలియానాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అన్నారు.

English summary
Actress Pragathi is glamorous mother on screen. She is now address for young mother charcters in film Industry. She reveals her success as on screen mother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu