»   » పోటీపోటీగా ఓపెన్ చేసిన కాజల్, ప్రణీత..(పిక్చర్స్)

పోటీపోటీగా ఓపెన్ చేసిన కాజల్, ప్రణీత..(పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హాట్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ప్రణీతలు అభిమానుల పోటా పోటీగా ఓపెన్ చేసారు. ఈ ఇద్దరు హీరోయిన్లు హైదరాబాద్‌లో అమీర్ పేటలో ఒకే రోజు వేర్వేరు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెన్నై షాపింగ్ మాల్ సంస్థ అమీర్ పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన షోరూంను కాజల్ అగర్వాల్ చేతులమీదుగా గ్రాండ్‌‌గా ఓపెనైంది.

మరో వైపు 'అత్తారింటికి దారేది' చిత్ర హీరోయిన్ ప్రణీత చేతుల మీదుగా ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థ అమీర్ పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఇద్దరూ హీరోయిన్లు అమీర్ పేటకు రావడంలో వారిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు, ఈ ఇద్దరు హీరోయిన్ల గురించి వివరాలు స్లైడ్ షోలో చూద్దాం....

కాజల్

కాజల్


అమీర్ పేటలో చెన్నై షాపింగ్ మాల్ సంస్థ వారు కొత్తగా ఏర్పాటు చేసిన షోరూంను హీరోయిన్ కాజల్ ప్రారంభోత్సవం చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అభిమానులు

అభిమానులు


తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న కాజల్. ఆమె సినిమా లైఫ్ వివరాల్లోకి వెళితే....కాజల్ చివరిసారిగా తెలుగులో ‘బాద్ షా' చిత్రంలో కనిపించింది. ఆమె ‘ఎవడు' చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. తర్వాత తెలుగులో ఆమె ఏ సినిమాకు సైన్ చేయలేదు.

ప్రణీత

ప్రణీత


ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థ అమీర్ పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన షోరూంను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ‘అత్తారింటికి దారేది' హీరోయన్ ప్రణీతను ఈ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు.

బ్యూటిఫుల్

బ్యూటిఫుల్


హీరోయిన్ ప్రణీత ఆర్.ఎస్.బ్రదర్స్ షోరూంలో పట్టుచీరలను ప్రదర్శిస్తున్న దృశ్యం. ఆమె సినిమాల వివారల్లోకి వెళితే....ఆమె నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. మరోవైపు ఆమె శ్రీవాస్ దర్శకత్వంలో ఒ సినిమా చేస్తోంది.

English summary
Actress Praneetha launches RS Brothers at Ammerpet, Hyderabad. Actress Kajal Agarwal launches Chennai Shopping Mall at Ameerpet, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu