»   »  నీలాంటి సినీ హీరోను పెళ్లి చేసుకొను.. అజర్ లాంటి క్రికెటర్ పెళ్లాడుతా.. షారుక్ దిమ్మతిరిగే జవాబు..

నీలాంటి సినీ హీరోను పెళ్లి చేసుకొను.. అజర్ లాంటి క్రికెటర్ పెళ్లాడుతా.. షారుక్ దిమ్మతిరిగే జవాబు..

Written By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో సూపర్ స్టార్ షారుక్ ఖాన్, మాజీ మిస్ ఇండియా, సినీ నటి ప్రియాంక చోప్రా ఇద్దరూ మంచి స్నేహితులు. దాదాపు 17 ఏళ్ల క్రితం వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Priyanka Chopra

2000 సంవత్సరంలో జరిగిన మిస్ ఇండియా పోటీలకు షారుక్ ఖాన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆ సందర్భంగా ప్రియాంక చోప్రాను ఓ ప్రశ్నను అడిగాడు.

ఎవరిని పెళ్లి చేసుకొంటావు..

ఎవరిని పెళ్లి చేసుకొంటావు..

అందాల పోటీల వేదికపై నిలుచున్న ప్రియాంకను అడిగిన ప్రశ్నే ఏమిటంటే.. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. క్రికెటర్ అజర్ భాయ్ లాంటి క్రీడాకారుడ్ని పెళ్లి చేసుకొంటావా లేదా స్వారోస్కీ లాంటి వ్యాపారవేత్తను వివాహమాడుతావా లేదా నా లాంటి హిందీ హీరోను పెళ్లి చేసుకుంటావా అని షారుక్ అడిగారు. మూడు రంగాలకు సంబంధించిన వారిలో ఎవర్ని ఎంపిక చేసుకొంటావు అని ప్రశ్నించారు.

నేను అతడినే పెళ్లి చేసుకొంటాను..

నేను అతడినే పెళ్లి చేసుకొంటాను..

షారుక్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం ఇస్తూ నేను భారతీయ క్రీడాకారుడిని పెళ్లి చేసుకొంటాను అని జవాబు ఇవ్వడం బాలీవుడ్ బాద్‌షాకు షాకిచ్చినట్టయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రియాంక చోప్రా షారుక్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించింది. షారుక్, ప్రియాంకల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి.

క్వాంటికో సిరీస్‌లో

క్వాంటికో సిరీస్‌లో

ప్రస్తుతం ప్రియాంక చోప్రా అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో నటిస్తున్నది. ఈ సిరియల్‌లో ఆమె నటించిన శృంగార సన్నివేశాలు చర్చనీయాంశమయ్యాయి. ప్రియాంక నటించిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతున్నది.

ప్రియాంక హాట్ హాట్‌గా

ప్రియాంక హాట్ హాట్‌గా

హాలీవుడ్ నటుడు మెక్ లాహ్లీన్‌తో కలిసి ప్రియాంక నటించిన పడక గది సీన్లు హాట్ హాట్‌గా కనువిందు చేస్తున్నాయి. ప్రియాంక నటించిన సీన్లు అమెరికా టెలివిజన్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. అలాగే బేవాచ్ ప్రమోషన్ యాక్టివిటీలో కూడా బిజీగా ఉన్నారు.

English summary
In a throwback video from 2000 going viral online, SRK is seen posing a question to Priyanka who is on the stage as a contestant. Shah Rukh Khan and Priyanka Chopra have been good friends for a long time. However, in a video from 2000 going viral online, SRK, as one of the judges of the Miss India pageant, is seen asking PC, one of a contestants, a question. Priyanka answers that she would go for an Indian sportsman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu