For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సన్నబడ్డ రాశి.. ‘మిర్చి’తో రీఎంట్రీ(ఫోటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : లావైపోయి, వేషాలు తగ్గిపోయిన హీరోయిన్ ఎవరూ అంటే రాశి అని టక్కున గుర్తుకు వస్తుంది. ఆమె సన్నబడి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ చిత్రంలో ఆమె కేవలం డబ్బింగ్ మాత్రమే చెప్తోంది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీకళ్యాణం' చిత్రంలో కాజల్ అగర్వాల్‌కి రాశి గాత్రదానం చేశారు. ఆ ప్రయత్నం ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రాశి 'మిర్చి' సినిమా కోసం డబ్బింగ్ చెప్పి వార్తల్లో నిలిచింది.

  ఇక రాశి గాత్రదానం చేసింది మరెవరికోకాదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నదియాకు. 'మిర్చి'లో నదియా కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంతో ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మళ్లీ బిజీ అవుతుందంటున్నారు. పెళ్లి తర్వాత నటనకు దూరమైన ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌కి సిద్ధమై బాగా స్లిమ్ అయ్యారు కూడా.

  తమిళంలో శింబు, వినయ్ చిత్రాల్లో నటించిన రాశి ఇప్పుడు తమిళంలో ఓ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో మూడు, నాలుగు చిత్రాల్లో ఆఫర్లు ఉన్నాయనీ, వాటిని ఫైనలైజ్ చెయ్యాల్సి ఉందని రాశి చెప్పారు. బాలనటిగా, హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించిన రాశి పెళ్లి చేసుకుని చిత్రరంగానికి దూరమయ్యారు. కొంతకాలం గ్యాప్ తరువాత ఆమె మళ్లీ చిత్రరంగ ప్రవేశం చేస్తున్నారు. నటనతో పాటు ఆమె డబ్బింగ్ మీద కూడా దృష్టి కేంద్రీకరించారు.

  రాశి చివరిసారిగా మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం చిత్రంలో విలన్‌గా, అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి తెరమరుగైంది. కాగా గతంలో తన భర్త నివాస్‌ను దర్శకుడిగా నిలబెట్టాలని 'మహా రాజశ్రీ' అనే సినిమాని తీసి నిర్మాతగా అపజయాన్ని మూటకట్టుకుంది. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరోసారి నిర్మాతగా, తన భర్త నివాస్ దర్శకత్వంలోనే ఓ సినిమా తీయాలనుకుంది. అప్పట్లో ఫైనాన్సియర్స్ కోసం ప్రయత్నించిన రాశి, ఈ ప్రయత్నాల్లో ఓ నిర్మాతని సంప్రదించగా ఆమెకు ఊహించని షాక్ ఎదురైనట్లుగా వార్తలు వచ్చాయి.

  రాశి రెండేళ్ల క్రితం 'సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డుల' కార్యక్రమంలో తలుక్కుమని మెరిసింది. ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరిలో హైదరాబాద్‌లో ఫంక్షన్ లో దర్శనం ఇచ్చిన రాశి...మీడియాతో మాట్లాడుతూ తన రీ ఎంట్రీ వివరాలను ప్రకటించింది. బాగా లావెక్కడం మూలంగానే ఈ ఏడేళ్లు సినిమాలకు దూరం అయ్యానని, ఇప్పుడు సన్న బడ్డానని చెప్పుకొచ్చింది. ఇంత కాలం చాలా అవకాశాల వచ్చినా కావాలనే పక్కన పెట్టానని, త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని, హీరోయిన్ లేదా, బాగా ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే తన రీ ఎంట్రీకి సంబంధించిన వివరాలను అఫీషియల్ గా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది.

  English summary
  Raasi dubing Mirchi Actress Raasi’s voice over for MirchiYoung Rebel Star Prabhas’s next movie is Mirchi and it is being directed by Koratala Shiva. Here is a big news that one of the actor Nadhiya she was acted as Prabhas mother in this movie and the vetern actress Raasi has given voice to her in this movie after a long time Raasi has re entered in Tollywood recently she has given voice to a heroin Kajal Agarwal. Now she is acting in a tamil movie beside Simbu so we heartly welcome her. The makers of Mirchi are planning to release on 8th February.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X